| About us | Contact us | Advertise with us

Sunday, March 1, 2015

మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్న జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల విశేషాలు

ఫిభ్రవరి 28 జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలను మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నాము. విద్యార్ధినీ విద్యార్ధులందరూ ఉదయం నుంచి ఉత్సాహంగా వేడుకలలో... thumbnail 1 summary
ఫిభ్రవరి 28 జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలను మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నాము. విద్యార్ధినీ విద్యార్ధులందరూ ఉదయం నుంచి ఉత్సాహంగా వేడుకలలో పాల్గొన్నారు. నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఇంతకంటే ఘనంగా వేడుకలను, పోటీలను నిర్వహించుకున్నప్పటికీ అనివార్య కారణాల వలన బహుమతుల ప్రధానం వేడుకలను ఘనంగా జరుపలేకపోయాము. ఒక సంవత్సరం మొక్కుబడిగా కానిచ్చేశాం. గత సంవత్సరం అయితే కనీసం బహుమతులు కూడా అందించలేదు. ఈ నిరుత్సాహంతో ఈ సంవత్సరం నేను వేడుకలకు పూర్తిగా దూరంగా ఉందామనుకున్నాను. కానీ మా ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సూర్యనారాయణ గారి ప్రోత్సాహంతో వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా, ఆనవాయితీను మార్చుతూ బహుమతులను కూడా ఘనంగా సమావేశాన్ని నిర్వహించి అందించాము.
ముందునుంచి ప్రణాళిక లేకపోవడంతో ప్రత్యేకంగా పోటీలను నిర్వహించలేదు. కనుక విద్యార్ధినీ విద్యార్ధులు సైన్సు దినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొనాలంటే ఏదైనా విభిన్నంగా చేయాలన్న ఆలోచనతో, నాకున్న ప్రాధమిక కంప్యూటర్‌ పరిఙ్ఞానాన్ని ఉపయోగించి జాతీయ సైన్సు దినోత్సవం - సైన్సు నిజజీవిత ఆవశ్యకత అనే అంశాలపై ప్రత్యేకంగా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపొందించాను. దీనిలో యూట్యూబ్‌నుంచి సేకరించి ఉంచిన రాకెట్‌లను ఎలా ప్రయోగిస్తారు?, బులెట్‌ట్రైన్‌లు ఎలా పనిచేస్తాయి?, అత్యంత ఆధునిక రోబోల తయారీ, శాస్ర్త సాంకేతిక రంగాల అభివృద్ధితో వచ్చిన ఫలితాలు, వంటి అంశాలపై వండర్‌ఫుల్‌ వీడియోలను ఉంచాను. అలాగే సైన్సు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సామాన్య మానవునికి శాస్ర్తీయ దృక్పధం అలవడటం లేదన్న తలంపును విద్యార్ధులలో కలిగించడానికై మూఢనమ్మకాలను గురించిన వీడియోలను కూడా సేకరించాను. వివిధ టివి ఛానల్‌్స వీడియోలు దీనిలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్లైడ్‌షో తరువాత నిన్న మన బ్లాగులో ఉంచిన 'జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు' కై గత సంవత్సరం దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌లో ప్రసారం అయిన ప్రోగ్రామ్‌ వీడియోను ప్రదర్శించాను. విద్యార్ధులు చాలా ఆసక్తిగా వీడియోలను వీక్షించడంతో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్న సంతృప్తి కలిగింది. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీలను మా సహ ఉపాధ్యాయులు నిర్వహించారు. సాయంత్రం సమయంలో నిర్వహించిన 'జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు - బహుమతి ప్రధానోత్సవం' వేడుకలలో మండల విద్యాశాఖాధికారి శ్రీ జి. ప్రసాద్‌గారు పాల్గొని సైన్సు ఆవశ్యకతను గురించి తెలియచేశారు. ఈ వేడుకలలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సూర్యనారాయణ గారు నిత్య జీవనంలో సైన్సు ఎలా మిళితం అయింది, సైన్సును పాఠశాల స్థాయిలో ఎలా నేర్చుకోవాలి వంటి అంశాలతో మంచి ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు పలువురు సైన్సు దినోత్సవం సందర్భంగా ఉపన్యసించారు.
అనంతరం పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులుఅందించాము. అలాగే ప్రతి తరగతిలోనూ సైన్సు సబ్జక్టులో ఆసక్తిని, ప్రయోగాల నిర్వహణలో ఆసక్తిని ప్రాతిపదికగా తీసుకుని ఎంపిక చేసిన విద్యార్దినీ విద్యార్ధులకు ప్రత్యేకంగా బహుమతులను అందచేయడం జరిగింది. ఈ ఎంపిక బాగా చదవడం ప్రాతిపదికన కాక, సైన్సు కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ఆధారంగా ఇవ్వడం వలన బాగా చదివే విద్యార్ధులు ఇకపై సైన్సును సైన్సులా నేర్చుకోవడానికి ఆసక్తి చూపడానికి అవకాశం ఉంది. నా ఉపన్యాసంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.
కొసమెరుపు ఏమంటే మా పాఠశాలలోని విజయానందం మాస్టారు సైన్సు గురించి పాట రూపంలో చక్కగా వివరించారు. ఈ పాటను త్వరలో నా బ్లాగు వీక్షకమిత్రులతో పంచుకోవడానికి బ్లాగులో ఉంచుతాను
ఇలా . . .
రెండు సంవత్సరాల విఫల సైన్సు దినోత్సవాలనుంచి
ఈ సంవత్సరపు సైన్సు దినోత్సవం సఫలం కావడం చాలా ఆనందంగా ఉంది.

మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

No comments

Post a Comment