| About us | Contact us | Advertise with us

Tuesday, March 18, 2014

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ఉద్యోగాల భర్తీ (ఖాళీలు 2167), పోస్టల్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ (ఖాళీలు 540) లకు ప్రిపేర్‌ అవ్వండి ఇలా

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 2167 ఖాళీలు          ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ (ఏపీఎఫ్‌డీ) ఫారెస్ట్ సె... thumbnail 1 summary
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 2167 ఖాళీలు
         ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ (ఏపీఎఫ్‌డీ) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్, బంగ్లావాచర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్‌ అటవీ విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ బీఎస్‌ఎస్‌ రెడ్డి తో ముఖాముఖి...
ప్ర: ఇంకా నోటిఫికేషన్లకు అవకాశముందా?
జ: ఉన్నాయి. 2015-16 మార్చి నాటికి మరో 1200 పోస్టులను ప్రకటించనున్నాం. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు.
వివరాలు........
1) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 151
2) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 751
3) అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 1224
4) థానేదార్: 16
5) బంగ్లావాచర్: 11
6) టెక్నికల్ అసిస్టెంట్: 14

Study Materialపోస్టల్ అసిస్టెంట్లు ఉద్యోగాల పరీక్ష స్పెషల్
పాలా సేవలను పటిష్ఠం చేసే లక్ష్యంతో కిందిస్థాయి సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమయింది. దేశవ్యాప్తంగా 8 వేలకు పైగా పోస్టల్‌ అసిస్టెంట్ల, సార్టింగ్‌ అసిస్టెంట్ల ఖాళీలకు ప్రకటన వెలువడింది. ఇందులో ఏపీ సర్కిల్లో రెండు పోస్టులూ కలిపి 540 ఉన్నాయి. ఎంపిక విధానం బ్యాంకు పరీక్షలను పోలి ఉండడం వల్ల ఆ పరీక్షార్థులు ఈలోగా పోస్టల్‌ పోస్టులపై దృష్టి పెట్టవచ్చు.
తపాలా శాఖలో ఖాళీల భర్తీకి విడుదలైన ప్రకటన ఇంటర్మీడియట్‌ అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వీటిలో వివిధ విభాగాల్లో 437 పోస్టల్‌ అసిస్టెంటు పోస్టులు, 103 సార్టింగ్‌ అసిస్టెంటు పోస్టులున్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 27తో ముగుస్తుంది.
అర్హత: ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌/ సమాన పరీక్ష పాసై ఉండాలి.
పరీక్ష విధానం: ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లుంటాయి:
పేపర్‌- 1 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 
పేపర్‌- 2 కంప్యూటర్‌/ టైపింగ్‌ టెస్ట్‌
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 100 మార్కులకు. ఇందులో 4 విభాగాలుంటాయి. అవి: 
1. జనరల్‌నాలెడ్జ్‌- 25 ప్రశ్నలు: వర్తమానాంశాలు, క్రీడలు, చరిత్ర, భౌగోళిక వ్యవస్థ, ప్రాథమిక ఆర్థికాంశాలు, రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, విజ్ఞానశాస్త్రం- పర్యావరణంపై 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.
2. మేథమేటిక్స్‌- 25 ప్రశ్నలు: ఈ విభాగంలో మెట్రిక్యులేషన్‌ స్థాయిలో సంఖ్యామానాలు, సంక్షిప్తీకరణ, దశాంశాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, శాతాలు, సగటు, లాభం- నష్టం, కాలం- పని, కాలం- దూరం వంటి అంశాలపై 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.
3. ఇంగ్లిష్‌ గ్రామర్‌- 25 ప్రశ్నలు: ఇందులో ప్రిపొజిషన్స్‌, యాడ్‌ వెర్బ్స్‌, కంజంక్షన్స్‌, డైరెక్ట్‌- ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, సింగులర్‌& ప్లూరల్‌, టెన్సెస్‌, యాంటనిమ్స్‌, సిననిమ్స్‌ వంటి వాటిపై 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.
4. రీజనింగ్‌ & మెంటల్‌ ఎబిలిటీ- 25 ప్రశ్నలు: 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి. మొత్తం సమయం 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు.
పేపర్‌-2 కంప్యూటర్‌/ టైపింగ్‌ టెస్ట్‌లో 30 నిమిషాలకు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. (15 నిమిషాలు టైపింగ్‌, 15 నిమిషాలు డాటా ఎంట్రీ). ఇందులో ఇంగ్లిష్‌లో 450 మాటలున్న ఒక పాసేజ్‌ను నిమిషానికి 30 పదాల వేగంతో/ హిందీలో 375 పదాలున్న పాసేజీని నిమిషానికి 25 పదాల వేగంతో టైప్‌ చేయాలి. ఈ పరీక్షను కంప్యూటర్‌పై నిర్వహిస్తారు.
ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు.
ఎలా సన్నద్ధమవ్వాలి?


జనరల్‌ నాలెడ్జ్‌: రాతపరీక్షలో మొదటి విభాగమైన జనరల్‌ నాలెడ్జ్‌కు సాధారణంగా అభ్యర్థులు చాలా పుస్తకాలు చదువుతుంటారు. కానీ ప్రశ్నలు ఏవిధంగా వస్తాయో అవగాహన చేసుకుని ఆ కోణంలో చదివితే సన్నద్ధత సులభమవుతుంది. ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి.

ఉదాహరణకు సైన్స్‌లో వ్యాధులు, ఎంజైములు, విటమిన్లు, దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే శాస్త్ర సంబంధ విషయాలు తెలుసుకోవాలి. వర్తమానాంశాల్లో గత ఆర్నెల్ల పరిణామాలు ముఖ్యం. ముఖ్యమైన సదస్సులు, నియామకాలు, అవార్డులు- గ్రహీతలు వంటివి చదవాలి. ఇతర సబ్జెక్టుల్లో కూడా ప్రాథమికాంశాలు తప్పనిసరిగా గ్రహించాలి.
మేథమేటిక్స్‌: మేథమేటిక్స్‌లో శాతాలు, లాభం- నష్టం, కాలం- పని, నంబర్‌ సిరీస్‌ వంటి వాటిపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. సూత్రం ప్రకారమే సాధించటం మంచి విధానమే అయినా తర్కం కూడా ఉపయోగిస్తే సమయం ఆదా అవుతుంది. ఇక్కడ సరైన సమాధానం గుర్తించడమే ప్రధానమనేది గుర్తుంచుకోవాలి. అయితే కాన్సెప్ట్‌ అర్థం చేసుకోవడానికి 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాలు చదవాలి. ఈ విభాగానికి ఎంత బాగా సాధన చేస్తే అంత మంచిది.
ఇంగ్లిష్‌: ఈ విభాగంలో ప్రాథమిక వ్యాకరణం తప్పనిసరిగా తెలుసుకోవాలి. టెన్సెస్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, వెర్బ్‌ను ఉపయోగించడం వంటి వాటిపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఒకే పదాన్ని వివిధ సందర్భాల్లో ఎటువంటి అర్థంలో వాడాలో తెలుసుకోవడం అవసరం. ఇంకా పదజాలం కూడా ముఖ్యం. సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ మాత్రమే కాకుండా ఇడియమ్స్‌, ఫ్రేజెస్‌, ఫ్రేజల్‌ వెర్బ్స్‌ కూడా తెలుసుకోవాలి.
రీజనింగ్‌ & మెంటల్‌ ఎబిలిటీ: రీజనింగ్‌ విభాగంలో వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ రెండు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే ప్రాథమికాంశాలు బాగా తెలుసుకుని సాధన చేయాలి. కాన్సెప్టును స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని వివిధ నమూనాలకు అన్వయించడం తెలుసుకోవాలి. కోడింగ్‌- డీకోడింగ్‌, రీజనింగ్‌లో ఒక ప్రధాన అంశం. ఈ అంశానికి సంబంధించి ఆల్ఫాబెట్‌ స్థానాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. క్యాలెండర్‌, డైరెక్షన్‌ వంటివి కూడా ముఖ్యమైనవే. డైరెక్షన్‌ టెస్ట్‌లో డైరెక్షన్స్‌/ దూరం కనుక్కోమని అడుగుతారు. దీనికి ప్రశ్నలో అడిగినదానికి అనుగుణంగా ప్రయత్నిస్తే సులభమవుతుంది. ఈ విభాగంలో ప్రతి అంశానికీ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయటం అవసరం.
ఎన్నేసి పోస్టులు?
దేశవ్యాప్తంగా 22 పోస్టల్‌ సర్కిళ్లలో పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు తపాలాశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో ఉన్న పోస్టులు: 
పోస్టల్‌ అసిస్టెంట్లు- 364
సార్టింగ్‌అసిస్టెంట్లు- 103
పోస్టల్‌ అసిస్టెంట్లు (సేవింగ్స్‌ - బ్యాంకు కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) 28
పోస్టల్‌ అసిస్టెంట్లు (సర్కిల్‌/ రీజనల్‌ఆఫీసులు)- 45
పోస్టల్‌ అసిస్టెంట్లు (మోటార్‌ మెయిల్‌ సర్వీస్‌) - 1 

వయః పరిమితి: 18 - 27 సంవత్సరాలు (జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు)
ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌/ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నుంచి 10+2/ ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
పరీక్ష ఫీజు: జనరల్‌, ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.400; ఎస్‌సీ, ఎస్‌టీ, శారీరక వికలాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 27 మార్చి, 2014
బ్యాంకు పరీక్షల సాధనతో...
బ్యాంకింగ్‌ రంగంపై దృష్టి పెట్టి బ్యాంకు ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నవారికి పోస్టల్‌ పోస్టులు మంచి అవకాశమే. ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల క్లరికల్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం వీరికి చేతిలో ఏ నోటిఫికేషన్‌ (స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ మినహా) లేనందున తపాలా పోస్టులపై దృష్టి పెట్టవచ్చు. పరీక్ష విధానం ఒకేవిధంగా ఉండడంతోపాటు ప్రారంభ వేతనం పోస్టల్‌ అసిస్టెంట్లకు బ్యాంకు క్లర్క్‌ కంటే అధికంగా ఉండడం ఆకర్షణీయం. ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ బ్యాంకు పరీక్షల్లో ఉండే నాలుగు విభాగాలు జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌లపై పోస్టల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. అయితే ఇంటర్‌ విద్యార్హతతో పోటీపడే పోస్టల్‌ పరీక్షలో ప్రశ్నలస్థాయి బ్యాంకింగ్‌ పరీక్షల కంటే సులభమే. గత ప్రశ్నపత్రాల పరిశీలన దీన్ని స్పష్టం చేస్తోంది. పోస్టల్‌ అసిస్టెంట్ల ఎంపికలు 2008, 2009, 2013 సంవత్సరాల్లో జరిగాయి. జనరల్‌నాలెడ్జ్‌ విభాగంలో బ్యాంక్‌ పరీక్షల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎకానమీ రంగాలపై లోతైన అవగాహన పరిశీలించే ప్రశ్నలుంటున్నాయి. తపాలా పోస్టుల పరీక్షలో బేసిక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నుంచే 25 ప్రశ్నలున్నాయి. అలాగే బ్యాంక్‌ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిష్‌లో ఉండే కాంప్రహెన్షన్‌, క్లోజ్‌టెస్ట్‌ వంటి క్లిష్ట విభాగాలు పోస్టల్‌ సిలబస్‌లో లేవు. అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ విభాగాల్లో సైతం మౌలిక అంశాలపై సిలబస్‌ రూపొందింది. గత ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు కూడా ప్రాథమిక అంశాలపైనే ఉన్నాయి.
వివరాలకు: www.pasadrexam2014.in

ఈ సమాచారాన్ని ఈనాడు దినపత్రికనుంచి సేకరించాను. దీనిలో కనిపిస్తున్న వెబ్‌ లింక్‌లు అన్నీ ఈనాడు దినపత్రిక వారి ప్రతిభవెబ్‌సైట్‌ ఎక్స్‌టర్నల్‌ లింక్‌లు.
ఈనాడు దినపత్రిక వారికి హృదయపూర్వక ధన్యవాదములు

No comments

Post a Comment