| About us | Contact us | Advertise with us

Friday, February 21, 2014

తెలంగాణా+ఆంధ్రప్రదేశ్‌ = తెలుగు వారి శక్తి . ఇలా అభివృద్ధి పథంలో నడుద్దాం . శక్తి చూపుదాం

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమును సాదించుకున్న తెలంగాణా మిత్రులకు శుభాకాంక్షలు. తెలంగాణా అంటే హైదరాబాద్‌ మాత్రమేనని భావించక, కనీసం చెప్పుకోవడా... thumbnail 1 summary
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమును సాదించుకున్న తెలంగాణా మిత్రులకు శుభాకాంక్షలు.
తెలంగాణా అంటే హైదరాబాద్‌ మాత్రమేనని భావించక, కనీసం చెప్పుకోవడానికి నెంబర్‌ 2  సిటీ అంటూ లేని పరిస్థితిని మార్చండి. పది జిల్లాలనూ అభివృద్ధి పథంలో నడపండి.భూగర్భంలో దాగున్న రత్నరాసులను వెలికి తీయండి. ఇప్పటికే అభివృద్ది చెందిన ఐటి పరిశ్రమను మరింత ప్రగతి పథంలో నడపండి. ఇంతకు మించి అనుకూలతలు నాకు గుర్తురావడంలేదు. కారణం నేను ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాడిని కావడమేమో. మీరు తెలంగాణా రాష్ట్రం వారైతే మీ అనుకూలతలను పంపండి. ఈ వ్యాసంలో చేర్చుతాను

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము అవశేష రాష్ట్రము కాదని చాటండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఏకరీతిగా అభివృద్ధి చెందింది. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకూ దాదాపు పదికి పైగా హైదరాబాద్‌తో పోటీ పడగల సత్తా ఉండి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, కడప లను మరింత అభివృద్ధి పథం లో నడిపిస్తూ హైదరాబాద్‌ను మించేలా ఆరోగ్యకరమైన పోటీతో నడవండి. వెయ్యికిలోమీటర్ల తీరప్రాంతం, అన్నపూర్ణగా పిలువబడుతూ పంటలను పండించగల సారవంతమైన నేలలు, ఇప్పటికే నెలకొల్పబడి ఉన్న పరిశ్రమలు, ఏకరీతి అభివృద్ధి, నదీజలాలకు దిగువరాష్ట్రమనే ఖ్యాతి, నదీజలాలను ఎత్తిపోతలద్వారా కాకుండా నేరుగా గ్రావిటీపై పంపుకోగల భౌగోళిక స్వరూపం మేధస్సు, ధనంగల జన సంపద ఆంధ్రప్రదేశ్‌ (సీమాంధ్ర) సొంతం. అభివృద్ధి పథంలో నడవడం ఆంధ్రప్రదేశ్‌కు చాలా సులభం

తెలంగానా రాష్ట్ర అభివృద్ధి అయినా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రఅభివృద్ధి అయినా మనం ఎన్నుకునే నేతలపైనే ఆధారపడి ఉంటుంది. వారిలో మార్పు రానంత వరకూ దోచుకోవడం, దాచుకోవడం పోనంత వరకూ అభివృద్ది అనేది డిక్షనరీలోనే తప్ప ప్రాక్టికల్‌గా కనిపించదు. కనుక ఎన్నుకునే నేతలలో ప్రస్తుత సంధి పరిస్థితులలో కుర్చీ కోసం కొట్టుకునేవారు కాకుండా సమర్ధవంతమైన పాలన అందించగల వ్యక్తిని ఎంచుకోండి. బయటికి ఒకటి చెప్తూ మనసులో దానికి భిన్నంగా చేసే మాయగాళ్లను విజయానికి దరిదాపుల్లోకి రాకుండా తరిమి కొట్టండి. మనం ఎంచుకునే నేతలపైనే భవిష్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రములు ఉన్నాయని గుర్తించండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజన వలన చాలా నష్టపోయి ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌. నూతన పరిశ్రమల స్థాపన, నూతన రాజధాని నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం, అత్యున్నత విద్యా సంస్థలేర్పాటు, నూతన రైల్వే జోన్‌ సాధన, ప్రాజక్టుల నిర్మాణం నదీజలాల పంపకం వంటి అంశాలను కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే రాబోయే చాలా కాలాలపాటు ఏడ్వాల్సివస్తుంది. అంతేకాక అసమర్ధనాయకుడివలన నష్టపోయే మనం అది గుర్తించక తెలంగాణా విడిపోవడం వలనే అబివృద్ధి కుంటుపడిందనే అపోహలో వారిని శత్రువులుగా భావించే అవకాశం లేకపోలేదు
కనుక ఇప్పుడు మనం ఎన్నుకునే నేతలు మనల్ని అభివృద్ధిచేసేల ఉండాలి. కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు నెరపగల వారై ఉండాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణా కూ మనకూ అనేక లావాదేవిలను సమర్ధవంతంగా నడపడానికి తెలంగాణా రాష్ట్రంతో సమర్ధవంతంగా సత్సంబంధాలను జరుపవలసిన మహానాయకుడిని ఎన్నుకోవాలి

ఎన్నుకుందాం. . . ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తెలంగాణా రాష్ట్రం ఒకటిగా ఉన్నా, రెండుగా ఉన్నా తెలుగువారి శక్తి ఏంటో చాటిచెప్దాం. ఆంధ్రప్రదేశ్‌ మేధోసంతతి మైక్రోసాఫ్ట్‌ సిఈఓగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ మేధోసంపత్తి లేకుండా అమెరికా ఒక్కరోజు కూడా నడవలేదని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షునిచేత మెప్పించగలిగింది. మన రాష్ట్రం అభివృద్ధి చెయ్యలేమా? చేద్దాం . . . చూపిద్దాం. . .
మీ స్పందనలను పంపండి
ఫోన్‌ 9441687174వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయితీ సెక్రటరీ, డియస్సీ, టెట్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బ్యాంక్‌ క్లర్స్క్‌, బ్యాంక్‌ పీఓస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్‌ - 4, గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 1, పదవ తరగతి, ఇంటర్‌మీడియట్‌ పరీక్షలకు అవసరం అయిన తెలుగు, ఇంగ్లీష్‌, భౌతిక శాస్ర్తము, రసాయన శాస్ర్తము, గణితము, సాంఘిక శాస్ర్తము, (అర్ధమెటిక్స్‌), రీజనింగ్‌, విద్యాదృక్ఫధాలు, సైకాలజీ వంటి సబ్జక్టులలో స్టడీమెటీరియల్స్‌ లభించును. TELUGU ENGLISH PHYSICAL SCIENCES PHYSICS CHEMISTRY NATURAL SCIENCES MATHEMATICS ARITHMETIC REASONING SOCIAL STUDIES STUDY MATERIALS, PRACTICE PAPERS, MODEL PAPERS useful for VRO VRA PENCHANT SECRETARY DSC TET POLICE CONSTABLES EXCISE CONSTABLES, RAILWAY RECRUITMENT TEST (RRB), RAILWAY RECRUITMENT CELL (RRC) BANK CLERKS, BANK PO's, STAFF SELECTION COMMISSION (SSC), GROUP-4, GROUP-2, GROUP-1, 10th CLASS, INTERMEDIATE available in this website. మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

1 comment

  1. No thanks. AP people can never forgive telabans.

    ReplyDelete