| About us | Contact us | Advertise with us

Thursday, September 26, 2013

సైకాలజీ - వైయుక్తిక బేధాలు

సైకాలజీ - వైయుక్తిక బేధాలు తరగతి గదిలోని ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకే రకంగా ఉండరు. ప్రజ్ఞాపాటవాల స్థాయిలో, శారీరక లక్షణాలలో, పాఠ్యాంశ విషయ ... thumbnail 1 summary

సైకాలజీ - వైయుక్తిక బేధాలు
తరగతి గదిలోని ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకే రకంగా ఉండరు. ప్రజ్ఞాపాటవాల స్థాయిలో, శారీరక లక్షణాలలో, పాఠ్యాంశ విషయ సాధనలో దృక్పథాలలో, మూర్తిమత్వ లక్షణాలలో, లైంగిక భేదాలలో, ఉద్వేగ రీతులలో సాంఘిక ఆర్థిక పరిస్థితులలో వ్యక్తిగత భేదాలు స్పష్టమవుతాయి.ఇవే వైయక్తిక భేదాలు.
వైయుక్తిక బెధాలకు కారణాలు:
  1. అనువంశికత
  2. పరిసరాలు
> అనువంశికత మరియు పరిసరాల వుమ్మడి ఫలితమె ప్రవర్తన.
  3. వయస్సు
  4. లైంగిక భేదాలు
> మగ వారు కాయ కష్టం చెయడం లొ ప్రగతి చూపితె, ఆడ వారు మానసిక ప్రకార్యాలలొ ముందు ఉండగలరు
  5. జాతి
మొదలైన అంశాలు వైయక్తిక భేదాలకు కారణమవుతాయి
పరిశొధనలు:
> వైయుక్తిక భేదాలపై తొలిసారిగా శాస్త్రీయం గా ప్రయొగాలను ఇంగ్లాండ్ కు చెందిన గాల్టన్ చెశారు.
> ఈయన సహ సంబంద గుణక పద్దతిలొ పరిశొధనలు జరిపారు
> ఈయన రాసిన గ్రంధం >>>>
> ఆ తరువాత మెకిన్ కాటిల్ వైయుక్తిక బేదాలపై పరిశొధనలు జరిపారు.
> కాతిల్ కారక విశ్లెషన పద్దతిన పరిశొధనలు జరిపారు.
> కాటిల్ రాసిన గ్రంధం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్
వైయుక్తిక భేదాలు - రకాలు:
వైయుక్తిక భేదాలు రెండు రకాలు
1. అంతర వ్యక్తిగత భేదం:
> ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో విభిన్నంగా ఉంటాడు. దీనిని అంతర వ్యక్తిగత భేదం అంటారు.
వుదాహరనకు రాజు తరగతిలొ తెలివైన పిల్లవాడు.
2.వ్యక్త్యంతర భేదం:
> ఒక్కోసారి ఒకే వ్యక్తిలోనూ భేదాలుంటాయి. వ్యక్తి ఒకసారి ప్రవర్తించిన రీతిగా మరోసారి ప్రవర్తించడు. దీనిని వ్యక్త్యంతర భేదం అంటారు.
వుదాహరనకు రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్తపడడు.
వైయుక్తిక భొదన:
> బోధనలో సఫలం కావాలనుకున్న ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనలను సాగించాలి.
> జాన్ డ్యూయీ మాటలలొ వైయుక్తిక భెదాలకు ప్రాముఖ్యత ఇచినపుడె దెశం అభివ్రుధి చెందుతుంది.
వైయుక్తిక బొధనా ప్రణాలికలు: 
వ్యక్తిగత సామర్ధ్యాలకు అనుగుణంగా బొధన జరపాలని ఈ ప్రణాలికలు రూపొందించారు
> గారి ప్రణాళిక, ప్రాజెక్టు పద్ధతి, మోరిసన్ ప్రణాళిక, వినె్నట్కా ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక, గ్రేడింగ్ విధానం మొదలైనవి వైయక్తిక భేదాలను అనుసరించి ఏర్పాటుచేసిన బోధన పద్ధతులు.
1. గారి ప్రణాళిక: 
> దీనిని 1908లో అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ‘గారి’ నగరంలో రూపొందించారు.
> రూపకర్త విలియం బర్ట్.
> పాఠశాల సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకొని వ్యక్తుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా బోధన కొనసాగించడం దీని ఉద్దేశం.
> విద్యార్ధులను రెండు సమూహాలుగా చెస్తారు
> ఒక సమూహం పాఠ్య కార్యక్రమాలలొ ఉండగా, మరొక బౄంధం పాఠ్యెతర కార్యక్రమాలను అభ్యసిస్తుంది

2. ప్రాజెక్టు పద్ధతి: 
> అమెరికన్ తత్వవేత్త జాన్ డ్యూరుూ వ్యావహారిక సత్తావాదం ఆధారంగా కిల్‌పాట్రిక్ ప్రతిపాదించాడు.
> వైయక్తిక శిక్షణతోబాటుగా బృందస్ఫూర్తి ఉండడం దీని ప్రత్యేకత.
> పాఠ్యాంశాలను ప్రాజెక్త్లుగా రూపొందించి విద్యార్దుల అభిరుచులకు అనుగుణంగా అందించదం ఈ పద్దతి ప్రత్యెకత

3. మోరిసన్ ప్రణాళిక: 
> చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మోరిసన్ దీనిని ప్రతిపాదించారు.
> ఇందులో బోధన ఐదు దశల్లో జరుగుతుంది.
  1. విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవడం.
  2. జ్ఞానానికి అనుగుణంగా బోధించడం.
  3. అధ్యయనాంశాన్ని అధ్యయనం చేసి, ప్రావీణ్య పరీక్షలకు సిద్ధంకావడం.
  4. అభ్యసన విషయాలను వ్యవస్థీకరించుకోవడం.
  5. చర్చించడం.

4. వినె్నట్కా ప్రణాళిక:
> అమెరికాకు చెందిన సి.డబ్ల్యు వాష్‌బర్న్ 1919లో (వినె్నట్కా) ప్రాథమిక పాఠశాలలో రూపొందించారు.
> ఇందులో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా వేర్వేరు అభ్యసన యూనిట్‌లను తయారుచేస్తారు.
> వివిధ స్థాయిలలోని విద్యార్థులు ఇతరులతో పోల్చుకోకుండా అభ్యసించడంవల్ల తాముకూడా అభ్యసిస్తున్నామనే భావనతోబాటుగా విజయభావన, సాధన, ప్రేరణలు కలుగుతాయి.

5. డాల్టన్ ప్రణాళిక:
> అమెరికాలోని ‘డాల్టన్ హైస్కూల్’లో హెలెన్ పార్క్ హర్‌స్ట్ దీనిని రూపొందించారు.
> కాలక్రమ పట్టికతో ప్రమేయం లేని అభ్యసనం దీని ప్రత్యేకత.
> స్వేచ్ఛ, సహకారం ఈ ప్రణాళిక ఆధార సూత్రాలు.
> విద్యార్థి తన అభిరుచులు, సామర్థ్యాల ఆధారంగా నియోజనాలను తీసుకొని పూర్తిచేస్తాడు.
> ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేకంగా ఒక తరగతి గది ఉంటుంది.దీనిని డాల్టన్ ప్రయొగశాల అంటారు
> అభ్యసన ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగతంగా జరుగుతుంది.

6. నాన్‌గ్రేడింగ్ పద్ధతి:
> ఇది పరీక్ష, ఉత్తీర్ణతలు లేని అభ్యసన పద్ధతి.
> ఏండర్‌సన్, గుడ్‌లాడ్‌లు దీనిని ప్రతిపాదించారు.
> దీని ప్రకారం ఆరు సంవత్సరాల పాఠశాల విద్యను రెండు భాగాలుగా చేస్తారు.
> 1, 2, 3 తరగతులను మొదటి భాగంగా 4, 5, 6 తరగతులను రెండో భాగంగా చేస్తారు.
> ప్రతి భాగాన్ని పనె్నండు ఉప భాగాలుగా విభజిస్తారు. విద్యార్థులు వారి వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వాటిని పూర్తిచేస్తారు.

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment