| About us | Contact us | Advertise with us

Tuesday, March 26, 2013

కరెంట్అఫైర్స్

కరెంట్అఫైర్స్  1) ఇటీవలే ‘ యూకియా అమనో ’ భారత దేశాన్ని సందర్శిం చారు. ఆయన ఏ సంస్థకు అధిపతిగా ఉన్నారు?              1. ప్రపంచ ఆర... thumbnail 1 summary

కరెంట్అఫైర్స్ 


1) ఇటీవలే యూకియా అమనో భారత దేశాన్ని సందర్శిం చారు. ఆయన ఏ సంస్థకు అధిపతిగా ఉన్నారు?
             1. ప్రపంచ ఆరోగ్య సంస్థ       2. ప్రపంచ బ్యాంక్
  3. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ 4. యూనిసెఫ్
2) 436 మంది వ్యక్తుల రక్షణకు ఎంత మొత్తాన్ని ప్రతి నెల వ్యయం చేస్తున్నట్లు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపిన నివేదికలో పేర్కొంది?
  1. రూ. 5 కోట్లు   2. రూ. 10 కోట్లు
  3. రూ. 15 కోట్లు   4. రూ. 30 కోట్లు
3) కరవు పరిస్థితుల నేపథ్యంలో ఏడు రాష్ట్రాలకు కలిపి ఎంత మొత్తాన్ని కేంద్రం ఇటీవలే ఆవెూదించింది?
  1. రూ. 892 కోట్లు   2. రూ. 1892 కోట్లు
  3. రూ. 2892 కోట్లు   4. రూ. 4982 కోట్లు
4) ఇటీవలే
పోప్ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొన్న కార్డిన ల్స్‌లో భారత్‌కు చెందిన తొట్టుంకల్ అతి చిన్న వయస్కుడు. అతను ఏ రాష్ట్రానికి చెందిన చర్చిలో ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు?
  1. కేరళ  2. చెన్నై
  3. ఉత్తర్ ప్రదేశ్   4. పశ్చిమబెంగాల్
5) ప్రపంచంలోనే అతిపెద్ద
అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఆల్మా పేరుతో మార్చి 13న ఎక్కడ ప్రారంభించారు?
  1. అమెరికా   2. చిలీ
  3. స్పెయిన్   4. అర్జెంటీనా
6) దేవధర్ ట్రోఫీ, ఏ క్రీడతో ముడిపడి ఉంది?
  1. హాకీ   2.ఫుట్‌బాల్
  3.క్రికెట్   4.కబడ్డి
7) యూఎన్డీపీ మానవాభివృద్ధి సూచి 2013 లో భారత్ ర్యాంక్ ఎంత?
  1. 136   2. 137
  3. 138   4. 139
8. డేనిలీ మాన్సిని, భారత దేశంలో ఏ దేశ రాయబారీగా ఉన్నారు?
  1. ఫ్రాన్స్   2. ఇటలీ
  3. బ్రిటన్   4. పైవేవీ కావు
9. ప్రపంచ బ్యాంక్ ఇటీవలే విడుదల చేసిన గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు 406 బిలియన్ డాలర్ల నగదును బదిలీ చేయనున్నారు. ఇందులో భారత్‌కే ఎక్కువ దక్కుతాయని భావిస్తున్నారు. ఎంత మొత్తం భారత్‌కు రావచ్చని అంచనా?
  1. 50 బిలియన్ డాలర్లు 2. 60 బిలియన్ డాలర్లు
  3. 70 బిలియన్ డాలర్లు 4. 80 బిలియన్ డాలర్లు
10. సుదర్శన్ రెడ్డి ఇటీవలే ఏ రాష్ట్ర లోకయుక్తగా నియమితు లయ్యారు?
  1. గోవా   2. మహారాష్ట్ర
  3. తమిళనాడు   4. కేరళ
1
1. ఈఎస్‌పీఎన్ ఇటీవలే ప్రకటించిన ర్యాంకుల్లో వన్‌డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా ఎవరు ఎంపిక య్యారు?
  1. షేన్ వాట్సన్   2. మహేంద్రసింగ్‌ధోని
  3. విరాట్ కొహ్లి   4. మార్లన్ శామ్యూల్స్
1
2. నిర్భయకు సంబంధించి కింది వానిలో సరైనది ఏది?
  1. ఇటీవలే భారత్ జరిపిన అణుపరీక్ష పేరు. విఫలం అయింది
  2. దీర్ఘశ్రేణి సూపర్ క్రూయిజ్ క్షిపణి, విఫలం అయింది
  3. కొత్తగా రూపొందించిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్   4. ఏదీ కాదు
13) రాష్ట్రాలు-గవర్నర్లను జతపరుచుము?
  1. నాగాలాండ్   ఏ) ఎస్సీ జమీర్
  2. ఓడిశా   బి) నిఖిల్ కుమార్
  3. బీహార్   సి) అశ్వినికుమార్
  4. కేరళ   డి) డి.వై.పాటిల్
  1) 1`సి, 2`ఏ, 3`డి, 4`బి
  2) 1`డి, 2`సి, 3`ఏ, 4`బి
  3) 1`ఏ, 2`బి, 3`సి, 4`డి 4) ఏదీ కాదు
14) 2011 జనాభా గణాంకాల ప్రకారం, మన రాష్ట్రంలో బాలుర లింగ నిష్పత్తి ఎంత ఉంది
  1. 941   2. 942
  3. 943   4. 944
15) నేపాల్ ప్రధానిగా ఖిలా రాజ్ రెజ్మి ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన ఏ పదవిలో ఉన్నారు?
  1. అధ్యక్షుడు
  2. జాతీయ అసెంబ్లీ స్పీకర్
  3. ఉపాధ్యక్షుడు   4. ప్రధాన న్యాయమూర్తి
16) యూరప్‌కు ఫార్మస్యూటికల్స్‌ను ఎగుమతి చేసిన తొలి భారతీయ సంస్థ ఏది
  1. రాన్‌బాక్సి   2. డాక్టర్ రెడ్డీస్
  3. టోరంటో   4. ఏదీ కాదు
17) రాష్ట్ర శాసన సభలో మార్చి 15న ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది?
  1. ఎంఐఎం   2. తెలుగుదేశం
  3. తెలంగాణ రాష్ట్ర సమితి   4. సీపీఎం
18) భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఏ దేశాన్ని ఉద్దేశించి ఇటీవలే పార్లమెంట్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆవెూదించింది?
  1. ఇటలీ   2. శ్రీలంక
  3. ఆప్ఘనిసాన్   4. పాకిస్తాన్
19) ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లు ఎన్ని ఉన్నాయని కేంద్రం ఇటీవలే తెలిపింది?
  1. 108   2. 109
  3. 110   4. 111
20) ప్రపంచంలో ఎన్ని దేశాల్లో రహదారి భద్రత నియమాలు ఉన్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది?
  1. 26   2. 27
  3. 28  4. 29
21) జీడీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతానికి తగ్గిపోవ చ్చని ఇటీవలే కేంద్రం ప్రకటించింది?
  1. 13.7%   2. 14.7%
  3. 15.7%   4. 16.7%
22) జాన్ బ్రెనన్, మార్చి 8న అమెరికాలోని ఏ సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు?  1. నాసా
  2. సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ
  3. ఫెడరల్ బ్యురో   4. ఏదీ కాదు
23) టూరిజం వీసా ఆన్ అరైవల్ను ఎన్ని దేశాలకు విస్తరించేందుకు ఇటీవల పర్యాటక మంత్రి చిరంజీవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు చేశారు?  1. 14   2. 15
  3. 16  4. 17
24) 2013-14 బడ్జెట్ నివేదిక ప్రకారం, స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి భారత్కు పాకిస్తాన్ ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంది? (విభజనకు ముందు అంగీకరించిన మేరకు)
  1. రూ. 300 కోట్లు   2. రూ. 400 కోట్లు
  3. రూ. 500 కోట్లు   4. రూ. 600 కోట్లు
25) ఇటీవలే ఏ ఖండంలో 18 కేజీల బరువుండే అతి పెద్ద ఉల్కాను అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం కనుగొంది?
  1. ఆసియా   2. ఆఫ్రికా
  3. అంటార్కిటికా   4. ఆస్ట్రేలియా
26) అమెరికా అధ్యక్షుడు ఒబామా తీసుకున్న నిర్ణయాలకు సంబం ధించి కింది వానిలో సరైనవేవి?
  1. 85 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయానికి కోత పెడుతూ అమెరికా అధ్యక్షు డు ఒబామా నిర్ణయం తీసుకున్నారు
  2. దీని వల్ల 75,000 ఉద్యోగాల కోత పడవచ్చని ఒబామా తెలిపారు
  1. కేవలం 1 సరైనది   2. కేవలం 2 సరైనది
  3. రెండూ సరికావు   4. రెండూ సరైనవి
27) భారత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. ఈ ఏడాది అక్టోబర్‌లో అరుణ గ్రహ యాత్రను భారత్ చేపట్టనుంది, ఇందుకు రూ. 450 కోట్ల వ్యయం కానుంది
  2. రూ. 462 కోట్ల వ్యయంతో తొలి నావిగేషనల్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది భారత్ చేపట్టనుంది
  3. ఈ ఏడాదే అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇస్రో చేపట్టనుంది. ఇది ఇస్రో ప్రయోగాల్లో అన్నింటి కంటే బరువైంది
  4. పైవన్నీ
28) క్రికెట్‌కు సంబంధించిన అన్ని ఫార్మట్లాలో తొలి వికెట్‌ను క్లీన్ బౌల్డ్ ద్వారా సాధించిన తొలి క్రికెటర్‌గా ఇటీవలే ఎవరు రికార్డ్ సృష్టించారు?
  1. రవీంద్ర జడేజ   2. ప్రజ్ఞాన్ ఓజా
  3. భువనేశ్వర్ కుమార్ 4. ఎవరూ కాదు
29) భారత దేశంలో మహిళా పోలీస్కు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. భారత దేశంలో మొత్తం పోలీసులు 16.6 లక్షలు ఉండగా (కానిస్టేబుల్ స్థాయి, 2011లోని గణాంకాలు) అందులో 93.3% అంటే కేవలం 93, 887 మంది మాత్రమే మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు
  2. దేశంలో తొలి మహిళా కానిస్టేబుల్ 1933లో ట్రావన్‌కోర్‌లో నియామకం అయ్యారు
  3. 2011లో మిజోరం రాష్ట్రంలో ఒక్క మహిళ పోలీసు కూడా లేక పోవడం గమనార్హం 4. పైవన్నీ
30) 12వ ప్రణాళిక కాలంలో సబ్సీడీల మొత్తాన్ని, జీడీపీలో ఎంత శాతానికి తీసుకు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది?
  1. 1.4%   2. 1.5%
  3. 1.6%   4. 1.7%
31) భూమికి అతి దగ్గరలోని పాల పుంతకు ఖచ్చితమైన దూరాన్ని ఇటీ వలే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ దూరం ఎంత (కాంతి సంవత్సరాల్లో)
  1. 143,000  2. 153,000
  3. 163,000   4. 173,000
32) వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి కింది వానిలో సరైనవేవి
  1. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డ్ సెహ్వాగ్ పేరిట ఉంది. ఆయన ఒక ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వేగంగా చేసిన ట్రిపుల్ సెంచరీ
  2. వన్డే క్రికెట్‌లో ప్రపంచం లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరు గులు చేసిన రికార్డ్ సెహ్వాగ్ పేరిట ఉంది. ఆయన వన్‌డేల్లో చేసిన అత్యధిక స్కోర్ 219 పరుగులు (149 బంతుల్లో)
  3. వన్డేల్లో భారత్ తరఫున వేగంగా సెంచరీ చేసిన రికార్డ్ సెహ్వాగ్‌దే. 60 బంతుల్లో సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేశాడు   4. పైవన్నీ
33) వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్పెషల్ పర్పస్ వెహికిల్ చైర్మన్‌గా ఇటీవలే కేంద్రం ఎవరిని నియమించింది
  1. నవీన్ కుమార్   2. రంగరాజన్
  3. పార్ధసారథి షోమ్   4. విలాస్ చౌధురీ
34) దేశంలో పేదరికానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు తెలిపిన వివరాల ప్రకారం కింది వానిలో సరైనవేవి?
  1. 2009-10లో 30% మంది పేదలు ఉన్నారు. నగామీణ ప్రాంతాల్లో నెలకు రూ 673, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ 860 కంటే తక్కువ ఉన్న వాళ్లను పేదలుగా పరిగణించారు)
  2. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి సంబంధించిన గణనకు ప్రణాళిక సంఘం నోడల్ ఏజన్సీగా ఉంటుంది
  1. కేవలం 1 సరైనది   2. కేవలం 2 సరైనది
  3. రెండూ సరైనవి   4. రెండూ సరికావు
35) 2012లో ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్ని పిర్యాదులను కేంద్ర విజిలెన్స్ కమిషన్ అందుకుంది?
  1. 6227   2. 7227
  3. 8227   4. 9227
36) నగదు బదిలీ పథకానికి మిషన్ డైరెక్టర్గా ఇటీవలే ఎవరు నియామకం అయ్యారు
  1. రాజేందర్ సింగ్   2. రమేశ్ జహ్వార్
  3. సింధుశ్రీ కుల్లార్   4. ఎవరూ కాదు
37) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థపై 731 మిలియన్ డాలర్ల జరిమానాను యూరోపియన్ యూనియన్ ఇటీవలే విధించింది?
  1. మైక్రోసాఫ్ట్   2. డెలాయిట్
  3. విప్రో   4. యాపిల్
38) ఇటీవలే ఏ దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని ప్రారంభించారు?
  1. తైవాన్   2. భూటాన్
  3. చైనా   4.జపాన్
 39) గెయిల్‌కు తాజాగా మహారత్న హోదాను ఇచ్చారు. దీంతో ఈ హోదా ఉన్న సంస్థల సంఖ్య ఎంతకు చేరింది
  1. 7   2. 8
  3. 9   4. 10
40) ఎలవర్తి నాయుడమ్మకు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. ఎలవర్తి నాయుడమ్మ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెమికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త.
  2. ఆయన సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీలో నాలుగో వైస్ చాన్స్‌లర్‌గా కూడా పని చేశారు.
  3. పద్మశ్రీ, రాజలక్ష్మి అవార్డ్‌లు కూడా పొందిన నాయుడమ్మ, ఒక విమాన ప్రమాదంలో మృతి చెందారు.
  4. పైవన్నీ
41) ప్రతిష్టాత్మక స్కోడా అవార్డ్‌ను ఇటీవలే ఎవరికి ప్రకటించారు?
  1. దుర్గా ప్రసాద్   2. రామేశ్వర్ ఠాకుర్
  3. ఎల్.ఎన్. తాళ్లూర్   4. ఎవరూ కాదు
42) మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కింది వానిలో సరైనదేది?
  1. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2, 2006లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు.
  2. ప్రారంభంలో దీనిని దేశంలోని 200 జిల్లాలో అమలు చేశారు.
  3. 2007, 2008లలో మరో 130 జిల్లాలకు దీనిని విస్తరించారు.
  4. పైవన్నీ
43) ఎయిర్ క్రాఫ్ట్‌ను స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాహార్ ఎఫ్ 313 ఇటీవలే రూపొందించిన దేశం ఏది?
  1. ఇరాక్   2. పాలస్తినా
  3. ఇరాన్  4. ఉత్తర కొరియా
44) కిశోర్ రుంగ్తా, ఇటీవలే ఏ ప్రభుత్వ రంగ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు?
  1. బీహెచ్‌ఈఎల్   2. ఈసీఐఎల్
  3. ఎన్టీపీసీ   4. బీడీఎల్
45) భారతే దేశంలో ఆర్డినెన్స్కు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు మాత్రమే ఇలా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇస్తారు.
  2. ఆర్టికల్ 213 ప్రకారం, గవర్నర్ ఆర్డినెన్స్‌ను ఇచ్చే అధికారాన్ని కలిగి ఉంటారు.
  3. మంత్రి వర్గం సూచనల మేరకు ఆర్డినెన్స్‌లను జారీ చేయాల్సి ఉంటుంది.
  4. పైవన్నీ
46) బ్యాంక్‌లా ఫైనాన్స్ అంశాలకు సంబంధించి ఎగుమతులను పెంచడానికి ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
  1. రంగరాజన్   2. కాశ్యప్
  3. పద్మనాభన్   4. రఘురాం రాజన్
47) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ 5.3 కోట్లు వెచ్చించి ముంబాయి జట్టు దక్కించుకుంది. మ్యాక్స్‌వెల్, ఏ దేశానికి చెందిన ఆటగాడు?
  1. ఆస్ట్రేలియా   2. న్యూజిలాండ్
  3. వెస్టిండీస్   4. ఇంగ్లాండ్
48) మహిళలు ప్యాంట్ వేసుకోరాదన్న నిబంధనను ఇటీవలే ఏ దేశం ఇక చెల్లదని ప్రకటించింది. ఆ దేశంలో ఈ నిబంధనను 200 సంవత్స రాల కిందట రూపొందించింది
  1. సౌదీ అరేబియా   2. ఆప్ఘనిస్తాన్
  3. ఫ్రాన్స్   4. నేపాల్
49) అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి కింది వానిలో సరైనదేది?
  1. అంతర్జాతీయ ద్రవ్యనిధిని డిసెంబర్ 27, 1945లో ఏర్పాటు చేశారు.
  2. సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
  3. ప్రస్తుతం ఇందులో 188 సభ్య దేశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, వృద్ధిలకు సంబంధించి తప్పుడు సమా చారం
ఇచ్చిందన్న కారణంతో ఇటీవలే అర్జెంటీనాను ఐఎంఎఫ్ సెన్సార్ చేసింది.
  4. పైవన్నీ
50) బెంగళూర్‌లో నిర్వహించిన 27వ ఫెడరేషన్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో విజేతగా నిలిచింది ఏ రాష్ట్ర జట్టు?
  1. కేరళ   2. కర్నాటక
  3. తమిళనాడు   4. గుజరాత్
51) 2013 స్పెషల్ ఓలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ ఏ దేశంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించారు?
  1. ఉత్తర కొరియా   2. దక్షిణ కొరియా
  3. కెనడా   4. బ్యునస్ ఏయిర్స్
52) విదేశాల నుంచి డొనేషన్ రూపంలో నిధులు దక్కించుకున్న భారత నగరాల జాబితాలో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది
  1. 5   2. 6
  3. 7   4. 8
53) ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా ఇటీవలే ఎవరు నియామకం అయ్యారు ?
  1. ఎన్.హెచ్. రామరావు 2. ఆశోక్ సింఘ్
  3. పీ.ఆర్.వాసుదేవరావు
  4. హెచ్.ఆర్. సుకుమార్ సేన్
54) మరో దేశపు భూభాగంలోకి చొరబడి, అంతర్జాతీయ న్యాయస్థానాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందంటూ ఇటీవలే ఐక్యరాజ్య సమితి ఏ దేశాన్ని తప్పుపట్టింది
  1. సిరియా   2. ఇజ్రాయిల్
  3. అమెరికా   4. ఫ్రాన్స్
55) 2011-12 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర గణాంక కార్యాలయం ఇటీవలే విడుదల చేసిన వాటిలో కింది వానిలో సరైనదేది?
  1. 2011-12 ఆర్థిక సంవత్సరానికిగాను గతంలో వృద్ధి రేటు 6.5% గా ఉంటుందని పేర్కొనగా తాజాగా దానిని సవరించి 6.2 శాతంగా పేర్కొంది.
  2. గత తొమ్మిది సంవత్సరాలలో ఇదే కనిష్ట వృద్ధి. గతంలో సేవల రంగంలో వృద్ధి 8.9% ఉండగా, తాజాగా అది 8.2% తగ్గిందని తాజా సవరణలో కేంద్ర గణాంక శాఖ పేర్కొంది.
  3. పారిశ్రామిక వృద్ధి రేటును 3.6% నుంచి 3.5%కి తగ్గించగా, వ్యవసాయ వృద్ధిని మాత్రం 2.8% నుంచి 3.4%కి పెంచింది.
  4. పైవన్నీ
56) జనవరి 31న కేంద్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాలలో కింది వానిలో సరైనవేవి?
  1. నష్టాల్లో ఉన్న స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌ను ఆదుకునేందుకు రూ 200 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది
  2. ఆజర్‌బైజాన్‌లో హెస్ కార్పొరేషన్‌కు చెందిన చమురు క్షేత్రాల్లో వాటాను దక్కించుకునేందుకు ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది.
  1. కేవలం 1 సరైనది   2. కేవలం 2 సరైనది
  3. రెండూ సరైనవి   4. రెండూ సరికావు
57) నాసా ప్రయోగించిన అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌కు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. అడ్వాన్స్డ్ శాటిలైట్ టీడీఆర్ఎస్-కేను అమెరికా జనవరి 30, 2013 ఫ్లొరిడానుంచి ప్రయోగించింది
  2. ఇది గత ఉపగ్రహాల కంటే మెరుగైంది. టెలికమ్యూనికేషన్ పేలోడ్ ఎలక్ట్రానిక్స్, అధిక సామర్ధ్యం ఉన్న సోలార్ పానెల్ తదితర సౌకర్యాలు ఇందులో ఉన్నాయి
  3. టీడీఆర్ఎస్-కే శ్రేణిలో ఇది 11 ఉపగ్రహం
  4. పైవన్నీ
58)సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరికి బాధ్యతలు ఇటీవలే కేంద్రం అప్పగించింది? ( )
1. కుల్దీప్ సింగ్ 2. వినాయక్ నాయర్
3. ప్రణయ్ సాహే 4. ఎవరూ కాదు
59) ఐసీసీ ప్రపంచ మహిళల క్రికెట్ పోటీ తొలి మ్యాచ్ భారత్ - వెస్టిండీస్ మధ్య నగరంలో జరిగింది?
  1. అహ్మదాబాద్   2. బరోడా
  3. ముంబాయి   4. పూనే
60) డోపింగ్‌కు పాల్పడ్డట్లు ఇటీవలే అంగీకరించిన సైక్లిస్ట్ ఎవరు?
  1. మైకేల్ రాస్ముస్సేన్   2. హోల్డింగ్
  3. అగస్టస్   4. ఎవరూ కాదు
61) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, క్రీడా ప్రాంగాణాలకు సంబంధించి ఇటీవలే తీసుకున్న నిర్ణయాలలో కింది వానిలో సరైనదేది?
  1. ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా స్టేడియంను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశించారు.
  2. క్రీడా వేదికలను సాంసృ్కతిక కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు.
  3. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ నిర్మాణాలకు నోడల్ ఏజన్సీగా ఉంటుంది.
  4. పైవన్నీ
62) కార్పొరేషన్ బ్యాంక్‌కు సంబంధించి కింది వానిలో సరైనవేవి?
  1. జనవరి 28న బిబాస్ కుమార్ శ్రీవాస్తవ్, కార్పొరేషన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకం అయ్యారు.
  2. మంగళూర్ (కర్నాటక) ప్రధాన కేంద్రంగా పనిచేసే కార్పొరేషన్ బ్యాంక్‌ను 1906లో స్థాపించారు.
  3. కార్పొరేషన్ బ్యాంక్ మోటో ప్రాస్పరిటీ ఫర్ ఆల్
  4. పైవన్నీ
63) పత్రికా స్వేచ్చ సూచి జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
  1. 139   2. 140
  3. 141   4. 142
64) ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచి విడుదల చేసిన అంశాలకు సంబంధించి కింది వానిలో సరైనదేది?
  1. మొత్తం జాబితాలో 179 దేశాలు ఉన్నాయి. భారత్ గతంలో 131వ స్థానంలో ఉండగా, తాజాగా 140 స్థానానికి పడిపోయింది. 2002 నుంచి పోలిస్తే ఇదే అతి తక్కువ ర్యాంక్. విలేకరులపై దాడులు, ఇంటర్నెట్‌పై సెన్సార్ తదితర చర్యల మూలంగా ర్యాంక్ తగ్గిందని సంస్థ పేర్కొంది.
  2. ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, నార్వే దేశాలు అగ్రభాగంలో కొనసాగుతుండగా, తుర్కిమెనిస్తాన్, ఉత్తరకొరియా, ఎరిట్రి యాలు అడుగు భాగంలో ఉన్నాయి.
  3. భారత్‌కు పొరుగున్న ఉన్న చైనా ఈ జాబితాలో 173వ స్థానంలో ఉంది.
  4. పైవన్నీ
65) మహిళల రక్షణకుగాను కొత్త చట్టాన్ని ఏ రాష్ట్ర క్యాబినెట్ రూపొందించింది. ఫిబ్రవరిలో ఆ రాష్ట్రం, దీనిని శాసనసభలో ప్రవేశపెట్టనుంది?
  1. తమిళనాడు   2. పశ్చిమబెంగాల్
  3. కేరళ   4. గుజరాత్
66) బ్రిటన్ గణాంక అధికారులు ఇటీవల విడుదల చేసిన వివ రాల ప్రకారం బ్రిటన్‌లో ఎక్కువగా మాట్లాడుతున్న తొలి ఆరు భాషల్లో మూడు భారతీయ భాషలు ఉన్నాయి. అవి ఏవి?
  1. పంజాబ్, బెంగాలి, గుజరాతి
  2. బెంగాలి, తెలుగు, గుజరాతి
  3. గుజరాతి, తెలుగు, పంజాబి
  4. ఏవీ కాదు
67) పునరుత్పాదక శక్తులకు సంబంధించి ఏ దేశంతో ఇటీవలే భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
  1. జపాన్   2. స్పెయిన్
  3. ఇంగ్లాండ్   4. దక్షిణాఫ్రికా
68) బ్రహ్మపుత్ర నదిపై ఎన్ని ఆనకట్టలను నిర్మించనున్నట్లు చైనా ఇటీవలే ప్రకటించింది?
  1. 5   2. 4
  3. 3   4. 2
69) మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సమావే శాన్ని బహిష్కరించిన తొలి దేశం ఏది?
  1. ఇజ్రాయిల్   2. ఉత్తరకొరియా
  3. సిరియా   4. ఆఫ్ఘనిస్తాన్
70) ఉద్యోగుల వేతనాలు చెల్లించాక ఖజానాలో కేవలం 217 డాలర్ల మాత్రమే ఉన్నాయని ఇటీవలే ఏ దేశ ఆర్థిక మంత్రి ప్రకటించారు?
  1. ఆప్ఘనిస్తాన్   2. మాలి
  3. ఇథియోపియా   4. జింబాబ్వే
71) హైదరాబాద్‌లో నిర్వహించిన మూడు రోజుల బయో ఏషియా సదస్సు ఏ తేదీన ప్రారంభం అయింది?
  1. జనవరి 26   2. జనవరి 27
  3. జనవరి 28   4. జనవరి 29
72) జాన్‌కెర్రిని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ దేవ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించారు. కెర్రీ, ఏ సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో డెవెూక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు?
  1. 1992   2. 1996
  3. 2000   4. 2004
73) ఆర్‌బీఐ ఇటీవలే ప్రకటించిన ద్రవ్య విధానానికి సంబంధించి కింది వానిలో సరైనదేది?
  1. రెపోరేట్, నగదు నిల్వల నిష్పత్తిని 25 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ తగ్గించింది. దీంతో రెపోరేట్ 7.75%, సీఆర్‌ఆర్ 4%గా ఉన్నాయి.
  2. సీఆర్‌ఆర్ తగ్గింపుతో బ్యాంకులకు అదనంగా రూ 1800 కోట్ల మేర నగదు అందుబాటులోకి రానుంది.
  3. రివర్స్ రెపోరేట్‌ను కూడా ఆర్‌బీఐ సవరించింది. ఇది 6.75%గా ఉంటుంది
  4. పైవన్నీ
74) ఆర్‌బీఐ పరపతి విధానం ప్రకటించిన తర్వాత, బేస్‌రేట్‌ను తగ్గించిన తొలి బ్యాంక్ ఏది?
  1. ఎస్‌బీఐ   2. ఇండియన్ బ్యాంక్
  3. ఐడీబీఐ   4. దేనాబ్యాంక్
75)జనవరి 10న కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలలో కింది వానిలో సరైనవేవి
  1. జాతీయ బ్యాంకులకు రూ. 12, 517 కోట్ల ఆర్థిక సాయం, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎంపిక విధానంలో మార్పు
  2. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో10% వాటాలు విక్రయం, ఇందిరా అవాస్ యోజన పథకానికి నిధుల పెంపు
  3. రెండు జాతీయ రహదార్ల ప్రాజెక్టులకు రూ 5000 కోట్ల కేటాయింపు
  4. పైవన్నీ
76) భారతదేశానికి ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇటీవలే భారత దేశాన్ని సందర్శించిన లూయిజ్ లూలా డా సిల్వా కోరారు. ఆయన ఏ దేశానికి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు?
  1. శ్రీలంక   2. మాల్దీవులు
  3. బ్రెజిల్   4. వియత్నాం
77) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో ఎంత మొత్తం అన్ అకౌంటెడ్ ఆస్థులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇటీవలే పార్లమెంట్‌లో తెలిపారు?
  1. 290.29 కోట్లు   2. 390.29 కోట్లు
  3. 490.29 కోట్లు   4. 590.29 కోట్లు
78) గెలాక్సీ పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇటీవలే విడుదల చేసిన సంస్థ?
  1. నోకియా   2. బ్లాక్‌బెర్రీ
  3. శామ్‌సంగ్   4. ఏదీ కాదు
79) మచిలీ పట్నంలో రూ॥ 1000 కోట్లతో కొత్త ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి భారత రక్షణ పరిశోధన సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఏ కేంద్రానికి అనుబంధంగా పని చేయనుంది?
  1.వీలర్ ఐలాండ్   2. బాలాసోర్
  3. చాందీపూర్   4. ఏదీకాదు
80) 2017 నాటికి పునరుత్పాదక శక్తి సామర్ధ్యం ఎంత మేర పెరుగుతుందని ఇటీవలే సంబంధిత శాఖ కార్యదర్శి గిరీష్ పర్ధన్ పేర్కొన్నారు?
  1. 24,000 మెగావాట్లు  2. 34,000 మెగావాట్లు
  3. 44,000 మెగావాట్లు   4. 54,000 మెగా వాట్లుNo comments

Post a Comment