| About us | Contact us | Advertise with us

TEACHER'S ELIGIBILITY TEST (TET)

ప్ర‌స్తుతం ఖాళీల భ‌ర్తీ క్రమంగా కాక‌పోయినా ఎక్కువ‌గా జ‌రుగుతున్న రంగం ఉపాధ్యాయ రంగం. అయితే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే మాత్రం చాలా పోటీ ప... thumbnail 1 summary
ప్ర‌స్తుతం ఖాళీల భ‌ర్తీ క్రమంగా కాక‌పోయినా ఎక్కువ‌గా జ‌రుగుతున్న రంగం ఉపాధ్యాయ రంగం. అయితే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే మాత్రం చాలా పోటీ ప‌రీక్ష‌ల‌ను దాటుకుని నిల‌బ‌డాల్సి ఉంటుంది. అందులో కీల‌క‌మైన పోటీ ప‌రీక్ష టీచ‌ర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌). కేంద్ర‌ప్ర‌భుత్వ నియ‌మాలు అనుగుణంగా రూపుదిద్దుకున్న టెట్ పోటీప‌రీక్ష ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించ‌డానికి ఆయా అభ్య‌ర్ధుల‌కు ఉండాల్సిన క‌నీస ప‌రిఙ్ఞానాన్ని ప‌రీక్షించ‌డానికి ఉద్దేశించిన‌ది. ఉపాధ్యాయ ఉద్యోగాల‌కు అనుగుణంగా టెట్‌లో పేప‌ర్‌-1, పేప‌ర్‌-2 రెండు విభాగాలుంటాయి. డిఎడ్ కోర్సు చేసి ప్రాధ‌మిక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాల‌నుకుంటున్న అభ్య‌ర్ధులు ముందుగా టెట్ పేప‌ర్‌-1 లో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. అలాగే బిఎడ్ కోర్సు చేసి ఉన్న‌త పాఠ‌శాల‌లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఆశించే అభ్య‌ర్ధులు టెట్ పేప‌ర్ - 2 లో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. టెట్ ప‌రీక్ష‌లో సైకాల‌జీతో పాటు అన్ని స‌బ్జ‌క్టుల‌కు సంబంధించిన ప్రాధ‌మిక ప‌రిఙ్ఞానాన్ని ప‌రీక్షించేలా పేప‌ర్‌లు రూపొందించ‌డం జ‌రిగాయి. టెట్ పోటీ ప‌రీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధుల‌కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఆయా స‌బ్జ‌క్టుల‌లో చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్‌ను రూపొందించి అందిస్తుంది.

GENERAL KNOWLEDGE


CURRENT AFFAIRS


PSYCHOLOGY


GENERAL TELUGU


GENERAL ENGLISH


MATHEMATICS


PHYSICAL SCIENCE


BIOLOGICAL SCIENCE


SOCIAL STUDIES


No comments

Post a Comment