| About us | Contact us | Advertise with us

PANCHAYATI SECRATARIES

డిగ్రీ పూర్తి చేసుకుని, ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌న్న త‌ప‌న ఉన్న‌వారిని ఎంతోకాలం నుంచి ఊరిస్తున్న నోటిఫికేష‌న్ పంచాయితీ సెక్ర‌ట‌... thumbnail 1 summary

డిగ్రీ పూర్తి చేసుకుని, ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌న్న త‌ప‌న ఉన్న‌వారిని ఎంతోకాలం నుంచి ఊరిస్తున్న నోటిఫికేష‌న్ పంచాయితీ సెక్ర‌ట‌రీస్‌. గ్రామ పంచాయితీ స్థాయిలో కీల‌క‌మైన ఉద్యోగం కావ‌డం, చ‌క్క‌ని జీత‌భ‌త్యాల‌తో పాటు త‌మ ఊరికి స‌మీప ప్రాంతంలోనే ఉద్యోగం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డం వ‌ల‌న పంచాయితీ సెక్ర‌ట‌రీస్ భ‌ర్తీ ప‌రీక్ష‌కు పోటీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఉద్యోగాన్ని సాధించాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌ర‌చుకున్న అభ్య‌ర్ధులు ముందునుంచే స‌న్నద్దం కావ‌డం ద్వారా పోటీలో ముందువ‌రుస‌లో నిల‌బ‌డి, ఉద్యోగాన్ని సాధించే అవ‌కాశం ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేష‌న్ ఉన్న ఈ పోటీ ప‌రీక్ష‌లో క‌రెంట్ అఫైర్స్‌, అరిథ్‌మెటిక్‌, రీజ‌నింగ్ విభాగాలు కీల‌కంగా, ఉద్యోగాన్ని నిర్ణయించే స‌బ్జ‌క్టులుగా ఉన్న‌వి. ముఖ్యంగా నాన్‌మ్యాథ్స్ అభ్య‌ర్ధులు అరిథ్‌మెటిక్‌, రీజనింగ్ విభాగాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అరిథ్‌మెటిక్ విభాగానికి ఆరు నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఉన్న గ‌ణిత పుస్త‌కాల‌లో ఎంపిక చేసుకున్న పాఠ్యాంశాల‌ను అవ‌గాహ‌న చేసుకుని ప‌ట్టు సాధించ‌డం ద్వారా చ‌క్క‌ని ఫ‌లితాన్ని సాధించ‌వ‌చ్చు. పాఠ‌శాల స్థాయి సైన్సు, సోష‌ల్ పుస్త‌కాల‌ను జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ విభాగానికి చ‌దువుతూ, జికె, క‌రెంట్ అఫైర్స్ విభాగాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి. పంచాయితీ సెక్ర‌ట‌రీస్ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధుల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించడానికై న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజీను అందుబాటులో ఉంచింది.
పంచాయితీ సెక్ర‌ట‌రీస్ ప్ర‌శ్నాప‌త్రాల శ్రేణిని ఈమెయిల్ ద్వారా పొందడానికి, వివ‌రాల‌కోసం సంప్ర‌దించండి . . . న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌, ఫోన్ 9441687174

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌


క‌రెంట్ అఫైర్స్‌


జ‌న‌ర‌ల్ సైన్స్ - భౌతిక, ర‌సాయ‌న శాస్త్ర‌ములు


జ‌న‌ర‌ల్ సైన్స్ - జీవ‌శాస్త్ర‌ము


ఆధునిక భార‌త‌దేశ చ‌రిత్ర‌


భార‌త‌దేశ ఆర్ధికాభివృద్ధి


ARITHMETICS


REASONING


పంచాయితీ రాజ్ వ్య‌వ‌స్థ‌


No comments

Post a Comment