నవచైతన్య కాంపిటీషన్స్ . . .
నిరుద్యోగ అభ్యర్ధులకు పోటీ పరీక్షలకు అవసరం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందించాలన్న సత్సంకల్పంతో ఏర్పాటైన వెబ్సైట్. వృత్తి రీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ సత్యవాడ చైతన్య కుమార్ గారిచే ఈ వెబ్సైట్ ప్రారంభించబడినది. నిష్ణాతులైన అధ్యాపకులనుంచి చక్కని స్టడీమెటీరియల్స్‌ను సేకరించి, పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు ఆసక్తికరమైన రీతిలో అందించేలా నవచైతన్య కాంపిటీషన్స్ వ్యూహాన్ని అమలుపరుస్తున్నది. వివిధ పోటీ పరీక్షలను గురించిన నోటిఫికేషన్ దగ్గరనుంచి పోటీ పరీక్ష పూర్తై, ఫలితాలు వచ్చే వరకూ చక్కని గైడెన్స్‌ను అందిస్తుంది నవచైతన్య కాంపిటీషన్స్. ఆయా పోటీ పరీక్షలకు అవసరం అయిన చక్కని స్టడీమెటీరియల్స్, ప్రాక్టీస్ పేపర్లు, మోడల్ పేపర్లు మరియు ప్రీవియస్ పేపర్లతో పాటు ఆయా సబ్జక్టులలోని కీలక అంశాలకు సంబంధించిన ఆడియో లెసన్లను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తుంది. ఇంటి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా సాగడానికి నవచైతన్య కాంపిటీషన్స్ సబ్జక్టును భాగాలుగా రూపొందించి, ఆయా భాగాలకు డివిజినల్ టెస్ట్‌లను, గ్రాండ్ టెస్ట్‌లను పోస్టు మరియు ఈమెయిల్ ద్వారా అందించి, అభ్యర్ధుల ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా సాగడానికి అవసరం అయిన మార్గనిర్దేశనం చేస్తుంది. అందుకే నవచైతన్య కాంపిటీషన్స్ నినాదం
మీ లక్ష్యం + మా విధానం = మన విజయం
No comments
Post a Comment