Frequently Asked Questions in www.navachaitanya.info
1. నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్‌సైట్‌లోని స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చా?
నవచైతన్య కాంపిటీషన్స్ అనేది పూర్తి ఉచితంగా చక్కని స్టడీ మెటీరియల్స్‌ను అందించాలన్న సత్సంకల్పంతో ఏర్పాటైన వేదిక. దీనిలో లభించే ప్రతి మెటీరియల్‌ను పూర్తి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
2. నవచైతన్య కాంపిటీషన్స్లోని మెటీరియల్ ఫైళ్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- నవచైతన్య కాంపిటీషన్స్ ప్రతి వెబ్పేజిలోనూ పిడిఎఫ్ లేదా ఇమేజ్‌ల రూపాలలోని స్టడీ మెటీరియల్స్ రెండూ లేదా ఏదో ఒకదాని రూపంలో ఉంచడం జరుగుతుంది.
పిడిఎప్ రూపంలోని ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవడం
- పిడిఎఫ్ రూపంలోని ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం.
- జస్ట్ మెటీరియల్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి అంటూ కనిపించే లింక్‌పై జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే కొద్ది సెకన్లలోనే ఆ మెటీరియల్ పిడిఎఫ్ రూపంలో మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది.
ఇమేజ్‌ల రూపంలోని ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవడం
- ఇది కొద్ది సమయం తీసుకున్నప్పటికీ సాధ్యమే.
- మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న మెటీరియల్ ఇమేజ్ పై రైట్ క్లిక్ చేయండి.
- ఆపై ఓపెన్ అయ్యే లిస్ట్ నుంచి Save image as . . అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తరువాత ఓపెన్ అయ్యే విండోలో, ఫైల్‌కు పేరును, సేవ్ చేయవలసిన ప్రదేశాన్ని (డెస్క్టాప్ను ఎంచుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా చూడవచ్చు) ఎంచుకుని సేవ్‌పై క్లిక్ చేయండి.
- అంతే. . . మీరు కోరుకున్న ప్రదేశంలో ఆ ఇమేజ్ఫైల్ సేవ్ చేయబడుతుంది.
- సహజంగా ఇమేజ్‌లను ఎ4 కాగితంపై నేరుగా ప్రింట్ తీసుకోగలిగిన మాదిరి ఉంచబడతాయి కనుక ప్రింట్ చేసుకోవడం కూడా సాధ్యం అవుతుంది.
3. నవచైతన్య కాంపిటీషన్స్‌లో ప్రచురితం అవుతున్న ఫైళ్లను నేరుగా ఈమెయిల్ ద్వారా పొందడం ఎలా?
- నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్సైట్లోకి ప్రవేశించిన తరువాత హోం పేజి ఎడమ భాగంలో గమనిస్తే, Join our News Letter అని ఉండి, క్రిందన ఒక బాక్స్ దాని క్రిందన Join NOW అని ఉంటుంది.
- ఆ బాక్స్‌లో మీ ఈమెయిల్ చిరునామాను సరిగా అందించాలి.
- తరువాత Join NOW పై క్లిక్ చేసినపుడు ఒక కొత్త విండో ఓపెన్ అయ్యి, అక్కడ కనిపించే అక్షరాలను టైప్ చేయమని అడుగుతుంది.
- ఆ అక్షరాలను టైపు చేసి, ప్రక్కన కనిపించే Complete Subscription Request పై క్లిక్ చేయండి.
- చివరగా మీ ఈమెయిల్ ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేసి కొత్తగా ఫీడ్‌బర్నర్ పేరుతో వచ్చిన ఈమెయిల్‌ను ఓపెన్ చేసి, వెరిఫికేషన్ కోసం అందులో చూపే లింక్‌పై క్లిక్ చేయండి
- అంతే, ఆపై మీకు నేరుగా ఈమెయిల్ ద్వారా ప్రతిరోజూ, వెబ్సైట్లో అప్డేట్స్ అన్నీ చేర్చబడతాయి.
Tuesday, October 4, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment