| About us | Contact us | Advertise with us

Wednesday, October 26, 2016

Daily Current Affairs Quiz - survey

నేను గ‌త వారం రోజులుగా ప్ర‌చురిస్తున్న డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్‌పై వీక్ష‌కుల స్పంద‌న తెలియ‌డం లేదు. వీక్ష‌కుల‌కు దీనిపై ఉన్న అభిప్రాయాన్న... thumbnail 1 summary
నేను గ‌త వారం రోజులుగా ప్ర‌చురిస్తున్న డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్‌పై వీక్ష‌కుల స్పంద‌న తెలియ‌డం లేదు. వీక్ష‌కుల‌కు దీనిపై ఉన్న అభిప్రాయాన్ని బట్టి దీనిని కొన‌సాగించాలా వ‌ద్దాఅన్న‌ది నిర్ణయించాల‌నుకుంటున్నాను. అందుకే ఈ రోజు డైలీ క‌రెంట్ అఫైర్స్‌కు బ‌దులుగా ఇక్కడ ఈ పోల్ ను ఉంచుతున్నాను. మీ స్పంద‌న‌ను బ‌ట్టి రేప‌టి రోజు ఇక్కడ క‌రెంట్ అఫైర్స్ క్విజ్ ఉండాలా లేదా అన్న‌ది నిర్ణ‌యించ‌బ‌డుతుంది.
మీ
స్పంద‌న‌ను తెలియ‌చేయండి


డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్‌పై మీ స్పంద‌న‌ను తెలియ‌చేయండి.
Email:

చాలా బావుంది. రోజూ చూస్తాను.
బావుంది. అప్పుడ‌ప్పుడు చూస్తాను.
ప‌ర్లేదు. ఒక‌సారి చూడ‌వ‌చ్చు.
వృధా ప్ర‌య‌త్నం. చూడాల‌నుకోవ‌డం లేదు.
Other
Please Specify:
Poll Maker

8 comments

 1. Please dont stop.. People may be not commenting but still so many are using. I found it so helpful for me.. PLEASE KEEP POSTING FOR US PLEASE>!

  ReplyDelete
 2. అంత కష్టపడి వారు విషయాన్ని మీ ముందుంచుతుంటే ఉపయోగించుకుంటూ వారికి కనీసం వ్యాఖ్య ద్వారా తెలియచేయకపోతే దాన్నేమంటారు? వారెందుకు కొనసాగించాలి? మీరైతే ఏం చేస్తారు? ఆలోచించండి. తేల్చుకోండి మీది కృతజ్ఞతో కృతఘ్నతో

  ReplyDelete

 3. మీరే ఉద్దేశంతో ఈ బ్లాగుని ప్రారంభించారు ?

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. వృత్తి రీత్యా నేను ఉపాధ్యాయుడ‌ను.
   ఖాళీ స‌మ‌యాల‌లో
   నిరుద్యోగ అభ్య‌ర్ధుల‌కు చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్‌ను అందించే వేదిక‌ను ఏర్పాటు చేయాల‌న్న స‌త్సంక‌ల్పంతో ఈ బ్లాగును ప్రారంభించాను.
   నేను బోధించే, మిత్ర‌బృందం నుంచి సేక‌రించిన‌, నేను రూపొందించిన చక్క‌ని స్టడీ మెటీరియ‌ల్స్‌ను ఇక్క‌డ ఉంచుతున్నాను.
   ఇప్ప‌టికే సుమారు ప‌న్నెండు ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌కు న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ చేరువైన‌ది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇత‌ర (నావి కాని) స‌బ్జ‌క్టుల‌లో ఉచితంగా మెటీరియ‌ల్స్ అందించ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. మ‌రెవ‌రైనా ముందుకొచ్చి, చ‌క్క‌ని మెటీరియ‌ల్స్ అందిస్తే
   అన్ని సబ్జ‌క్టుల‌కు సంబంధించిన‌, అన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్ అందించే వేదిక‌గా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌ను నిల‌పాల‌న్న‌దే నా ల‌క్ష్యం

   Delete
  2. మాస్టారు,
   నమస్కారం,
   నేటి కాలంలో విద్యను వ్యాపార వస్తువుగా చేసి అమ్ముకుంటున్న రోజులలో, ఇలా బ్లాగ్ లో మీరు పంచుకోవడం అభినందనీయం. మరెవరూ ముందుకురారు, కనీసం మాట సాయం కూడా చేయరు. నాదైన అభిప్రాయం, మీకు ఓపికున్నంత చేయాలనుకున్నది చేయండి, మీకు ’ఉపయోగించుకున్నా’మన్న మాట కూడా చెప్పరు, మీరు ఆశించలేదనే అనిపిస్తుంది కూడా. మాలా పనిలేక వాగేవాళ్ళం చాలామందే ఉంటాం! మీ ఓపికతో స్వబుద్ధితో చేయండి.
   మరొకమారు ధన్యవాదాలతో
   నమస్కారం.

   Delete
  3. నేనో పనిలేనివాణ్ణి, చదువుకోని వాణ్ణీ, నాకు చదువు విలువ తెలుసు, మీకు అభినందన తెలియజేయడం తప్పించి ఏమీ చేయలేనివాడినే

   Delete

 4. ఇష్టం గా ఈ కష్టతరమైన కార్యక్రమాన్ని సాగిస్తున్నారు
  అటువంటప్పుడు స్పందన ల కోసం ఎదురు చూడటం వృధా (ఈ బ్లాగు లోకం లో యిట్లా చాలామంది స్పందన సరిగా రావడం లేదని వదిలేసినవాళ్ళు , వదిలాక మళ్ళీ వచ్చిన వాళ్లు, వదిలేస్తా వదిలేస్తానంటూ వదిలెయ్యలేక ఊగిస లాడుతున్న వాళ్లు యిట్లా చాలా వెరైటీ జనవాహిని ఉన్నారు )

  బ్లాగు కి పన్నెండు లక్షల వీక్షకులు ఉన్నారంటున్నారు , సో మంచి రెస్పాన్స్ ఉన్నట్టే లెక్క

  May be you can think about his to involve the readers in your this activity ?

  For example శంకరాభరణం - involves people (in fact responses contribute content there) although it also has limitation (selective group) which cannot be otherwise even for your competition focussed subject matter

  Other point is content on web lasts for more time (people come through specific searching)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. లేదు స‌ర్‌,
   మీర‌న్న‌ట్లు నవ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌కు వీక్ష‌కులు, సంఖ్యా ప‌రంగా, స్పంద‌న ప‌రంగా బాగానే ఉన్న‌ది.
   డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్ గురించిన స్పంద‌న‌ను గురించి, దానిని ఎంత‌వ‌ర‌కూ ఉద్యోగార్ధులు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆ పోల్‌ను ఉంచ‌డం జ‌రిగింది.
   మీ స్పంద‌న‌కు
   ప్రోత్సాహానికి ధ‌న్య‌వాద‌ములు

   Delete