10th Class Physical Science SA-1 Model Paper
Prepared by Sri B.J.R. Mohan Rao
శ్రీ మోహన్రావుగారు రూపొందించిన
10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలు - సంగ్రహణాత్మక మూల్యాంకనం - 1 తెలుగు మాధ్యమం
నమూనా ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నూతనంగా ప్రవేశ పెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఈ) (Continuous Comprehensive Evaluation) విధానంలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం (Summative Assessment) ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. సిసిఈ విధానాన్ని అనుసరించి నిర్మాణాత్మక మూల్యాంకనము (Formative Assessment) మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం (Summative Assessment) లో విద్యార్ధిలో సమగ్ర అవగాహనను (Understanding Levels of Student) పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative assessment) అనేది పూర్తిగా ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష (Teacher made tests) . దీనిలో ముఖ్యంగా నాలుగు సాధనాల (tools for Formative Assessment) ద్వారా విద్యార్ధిని పరీక్షించడం జరుగుతుంది.
1. విద్యార్ధి ప్రతిస్పందనలు - ప్రయోగశాల రికార్డులు (Reflections & Responses, Lab Record)
2. రాత అంశాలు (Writeups & Port-folios)
3. ప్రాజెక్టు పనులు (Project works)
4. లఘు పరీక్ష (Slip test)
అందుకే నవచైతన్య కాంపిటీషన్స్ ఇక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులచేత రూపొందించిన ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతున్నది. వీటిని నిశితంగా పరిశీలించి, పాఠ్యాంశాలను ఆరీతిలో చదవడం ద్వారా విద్యార్ధి తేలికగా సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది.
thanks to chaitanya sir
ReplyDelete