ఫ్రిజ్లోనుంచి తీసిన కూల్డ్రింక్ సీసాపై నీటి బిందువులెలా వచ్చాయి?
- ఇది సాంద్రీకరణము అనే భౌతిక దృగ్విషయానికి సంబంధించింది
- సాధారణంగా వాయుకణాలువేగంగా చలించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
- ఈ వాయు కణాలు శక్తిని కోల్పోయినపుడు వాటి స్థితిని మార్చుకుని ద్రవంగా మారతాయి. ఈ ప్రక్రియను సాంద్రీకరణం అంటారు.
- గాలిలో అనేక వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది.
- కూల్డ్రింక్ సీసాను బయట ఉంచినపుడు గాలిలోని నీటి ఆవిరి కణాలు వేగంగా చలిస్తూ సీసా గోడలను ఢీకొంటుంటాయి.
- గాలితో పోల్చినపుడు సీసా ఉపరితలం చల్లగా ఉండడంవలన, సీసా ఉపరితలం తనను డీకొట్టిన నీటి ఆవిరి కణాలను చల్లబరుస్తుంది.
- ఇలా చల్లబడిన నీటి ఆవిరి, నీటి బిందువులుగా మారి కూల్డ్రింక్సీసాపై చేరతాయి.
- డ్రింకు ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
No comments
Post a Comment