పోటీ పరీక్షలకు అవసరం అయిన మెటీరియల్స్, ప్రాక్టీస్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ అభ్యర్ధులకు పూర్తి ఉచితంగా అందించాలన్న సత్సంకల్పంతో జూన్ 12, 2012 న ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక సుదినం. బ్లాగ్ విజిటర్ల సంఖ్య ఇటీవలే 55,000 ను దాటినది. నేడు బ్లాగిల్లు టాప్ బ్లాగ్స్ రేటింగ్లో 77 సగటుతో టాప్ పది బ్లాగుల జాబితాలో (9వ స్థానం) లో నిలిచింది. ఇరవై రోజుల క్రితం ప్రారంభించిన నేరుగా ఈమెయిల్ ద్వారా మెటీరియల్ అందుకునే జాబితా ఈ ఇరవై రోజులలోనే నూటయాభైకు చేరడం మరో సుభ పరిణామం. ఈ బ్లాగ్ ఇలానే దినదినాభివృద్ధి చెందుతూ, ప్రిపేర్ అయ్యే పరీక్ష ఏదైనా, తెలుగులో సంపూర్ణ మెటీరియల్ అందించగల స్థాయికి చేరాలన్నది నా ఆశ.
సహకరించండి
మీ
చైతన్య కుమార్
meenavachaitanyam@gmail.com,
9441687174
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment