| About us | Contact us | Advertise with us

Sunday, September 22, 2013

జనరల్ తెలుగు—సంధి కార్యాలు - సంస్కృత సంధులు

ఈ జనరల్ తెలుగు మెటీరియల్   TET, DSC SGT, DSC SA TELUGU,  వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షల... thumbnail 1 summary

ఈ జనరల్ తెలుగు మెటీరియల్  TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగుసంధి కార్యాలు - సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి: 
అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాచ్చు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది
అ + అ = ఆ
ఇ + ఇ = ఈ
ఉ + ఉ = ఊ
ఋ + ఋ = ౠ
ఉదా: చంచలాత్ములు = చంచల + ఆత్ములు (అ + అ = ఆ)
ప్రళయాగ్ని = ప్రళయ + అగ్ని ( అ + అ = ఆ)
కవీశ్వరులు = కవి + ఈశ్వరులు (అ + అ = ఆ)
గౌరీశ = గౌరి + ఈశ (ఇ + ఈ = ఈ)
భానూదయం = భాను + ఉదయం (ఉ + ఉ = ఊ)
పితౄణం = పితృ + రుణం (ఋ + ఋ = ౠ)
శీతాద్రి = శీత + అద్రి (అ + అ = ఆ)
2. గుణసంధి: 
అకారానికి ఇ,ఉ,ఋ పరమైతే క్రమంగా ఏ, ఓ, ఆర్‌లు ఏకాదేశమౌతాయి.
అ + ఇ = ఏ
అ + ఉ = ఓ
అ + ఋ = ఆర్
ఉదా: 1. ఇతరేరత = ఇతర + ఇతర (అ + ఇ = ఏ)
విశేషం: సంస్కృతంలో ఆమ్రేడితమనే పేరు రెండవ పదానికి వస్తుంది. తర్వాత అది ఏ సంధి అయితే ఆ సంధి వస్తుంది.
2. ¤ సూర్యోదయం = సూర్య + ఉదయం (అ + ఉ = ఓ)
¤ పరోపకారం = పర + ఉపకారం (అ + ఉ = ఓ)
¤ ఉత్సాహోద్రేకాలు = ఉత్సాహ + ఉద్రేకాలు (అ + ఉ = ఓ)
¤ సమరోత్సాహం = సమర + ఉత్సాహం (అ + ఉ = ఓ)
¤ దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
3. యణాదేశ సంధి: 
ఇ, ఉ, ఋ అనే అక్షరాలకు అసవర్ణ అచ్చు పరమైతే య, వ, ర అనే అక్షరాలు ఆదేశంఅవుతాయి. ఇక్కడ య, వ, ర అనే పూర్తి అక్షరాలు కాక య, వ, ర వత్తులు మాత్రమే వస్తాయి.
ఉదా: 1. ప్రత్యక్షం = ప్రతి + అక్షం
పై ఉదాహరణలో మొదటి పదం చివరి అక్షరం 'తి'లో ఉన్న అచ్చు 'ఇ'. రెండవ పదంఅక్షంలో మొదట ఉన్న అచ్చు 'అ'. ఈ రెండు అసవర్ణాలు కనుక 'ఇ' స్థానంలో 'య' వత్తు వచ్చిప్రత్యక్షం అని వస్తుంది.
ఉదా: 2. అణ్వస్త్రం = అణు + అస్త్రం
         3. పిత్రంశ = పితృ + అంశ
         4. అత్యంత = అతి + అంత
4. వృద్ధి సంధి: 
అకారానికి ఏ, ఐ పరమైతే ఐ; ఓ
, ఔ పరమైతే ఔ; ఋ, ౠ పరమైతే ఆర్ ఏకాదేశం అవుతాయి.
అ + ఏ = ఐ,
అ + ఐ = ఐ,

అ + ఓ = ఔ,
అ + ఔ = ఔ
అ + ఋ = ఆర్,
అ + ౠ = ఆర్
ఉదా: 1. ఏక + ఏక = ఏకైక (అ + ఏ = ఐ)
         2. భువనైక = భువన + ఏక (అ + ఐ = ఐ)
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment