| About us | Contact us | Advertise with us

Sunday, September 22, 2013

జనరల్ తెలుగు - తెలుగు సంధులు

ఈ జనరల్ తెలుగు మెటీరియల్   TET, DSC SGT, DSC SA TELUGU,  వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు... thumbnail 1 summary

ఈ జనరల్ తెలుగు మెటీరియల్  TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగు - తెలుగు సంధులు
సంధి నిర్వచనం
పూర్వపదం చివర ఉన్న అచ్చుకు బదులు పరపదం మొదట ఉన్న అచ్చురావడాన్ని 'సంధి' అంటారు.
1. ఉత్వ సంధి: 
ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.
ఉదా: అతడట్లు = అతడు + అట్లు (ఉ + అ ్ష అ) ఇక్కడ పూర్వపదం మొదట ఉన్న అచ్చు 'ఉ'పరపదం మొదట ఉన్న అచ్చు 'అ'. 'ఉ' స్థానంలో 'అ' వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి.
ఉదా: విశ్వమెల్ల = విశ్వం + ఎల్ల (ఉ + ఎ = ఎ)
         పేరాస = పేరు + ఆస (ఉ + ఆ = ఆ)
         తామొక్కరు = తాము + ఒక్కరు (ఉ + ఒ = ఒ)  
కేలిడు = కేలు + ఇడు (ఉ + ఇ = ఇ)
2. ఇత్వ సంధి : 
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం
ఉదా: ఏమయ్యె = ఏమి + అయ్యే (ఇ + అ = అ)ఇకారానికి, సంధి క్రియాపదాలలోనే వస్తుంది. కానీ ఇక్కడ క్రియలు కానటువంటిపదాలకు సంధి వచ్చింది కాబట్టి ఈ సూత్రం రాయాల్సి వచ్చింది. క్రియలు కాకుండా ఎక్కడైన ఇకారానికి సంధి వస్తే దాన్ని ఈసూత్రంతో సాధించుకోవాలి.
ఉదా: చీకటిల్లు = చీకటి + ఇల్లు (ఇ + ఇ)
వివరణ: ఇది తెలుగు పదం కనుక ఇక్కడ సవర్ణదీర్ఘసంధి రాదు.
ఏమంటివి = ఏమి + అంటివి (ఇ + అం = అం)
3. యడాగమ సంధి: 
సంధి జరగనిచోట అచ్చుకంటే పరంగా ఉన్న అచ్చుకి యడాగమం వస్తుంది.
ఉదా: సెల + ఏరు = సెలయేరు (ఆ + ఏ), ఇక్కడ అత్వసంధి రాదు (అత్తునకు సంధి బాహుళకం).
సంధి జరగలేదు కాబట్టి పరవర్ణంలోని 'ఏ' అను అచ్చుకు యడాగమం వచ్చి సెలయేరు అవుతుంద
కానకయున్న = కానక + ఉన్న (అ
 + ఉ)
4. త్రిక సంధి: 
¤ ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికాలు అంటారు.
¤ త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
¤ ద్విరుక్తమైన హల్లు పరమైతే ఆచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.
ఉదా: 1. ఏకడ ఏ + కడ ఎక్కడ
         2. ఏ విధము ఏ + విధము ఏ + వ్విధము ఎవ్విధము
5) ఆమ్రేడిత సంధి: 
ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది.
వివరణ: ఆమ్రేడితం అంటే ఒకే పదం రెండుసార్లు రావటం. అలా వచ్చిన రెండవ పదాన్ని ఆమ్రేడితంఅంటారు.
ఉదా: కడ + కడ, ఇందులో రెండోసారి వచ్చిన కడకు ఆమ్రేడితం అని పేరు.
పై సూత్రంతో మొదటి కడలోని 'డ' స్థానంలో 'ట్ట' వచ్చి 'కట్టకడ' అని వస్తుంది.
ఉదా: మొట్టమొదట = మొదట + మొదట
6. పుంప్వాదేశ సంధి: 
కర్మధారయ సమాసంలో 'ము' వర్ణానికి 'పు, పు'లు ఆదేశంగా వస్తాయి.
ఉదా: 1.విపరీతం + కోరిక, ఇక్కడ కోరిక అనేది విశేషం, విపరీతం అనేది విశేషణం కాబట్టి 
ఇదికర్మధారయ సమాసం. ఈ సమాసంలో 'ము' అనే అక్షరానికి 'పు' అనే అక్షరం ఆదేశంగా వస్తేవిపరీతపు కోరిక 'పు' వస్తే విపరీతపుకోరిక అని వస్తుంది.
2. స్వప్నపు సెజ్జ = స్వప్నం + సెజ్జ

7. రుగాగమసంధి: 
1. పేదాది శబ్దాలకు అలు శబ్దం పరమైతే కర్మధారయ సమాసంలో రుగాగమం వస్తుంది.
ఉదా: పేద + అలు = పేదరాలు
2. కర్మధారయ సమాసంలో తత్సమ (సంస్కృత) శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అత్వానికి ఉత్వంరుగాగమం వస్తాయి.
ఉదా: ఘటిక + ఆలు = ఘటికురాలు
ఇక్కడ ఘటిక అనే శబ్దం తత్సమం కాబట్టి 'అ + ఆ', 'ఉ + రా'
ఆ పదం చివర ఉన్న 'క' అక్షరంలో ఉన్న'అ', 'ఉ' గా మారి రుగాగమం వచ్చి ఘటికురాలుఅవుతుంది.


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment