| About us | Contact us | Advertise with us

Tuesday, March 19, 2013

విద్యా దృక్పధాలు విద్యాహక్కు చట్టం - 2009

విద్యా దృక్పధాలు  విద్యాహక్కు చట్టం - 2009 ·   ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్... thumbnail 1 summary

విద్యా దృక్పధాలు 

విద్యాహక్కు చట్టం - 2009

· ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది.  ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది.  ఉచితంగా విద్యను హక్కుగా పొందే  ఈ సవరణ వలన మంచి పరిణామము ఇవ్వాలని కోరుతుంది.
· పాఠశాల నిర్వహణాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలందరికీ ఉచిత విద్యను కల్పించాలి.  ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలలలో 25 శాతం పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా ప్రవేశము కల్పించాలి.
· నాణ్యతతో పాటు అన్ని రకాల ప్రాథమిక విద్యా విషయాలను పర్యవేక్షించుటకు గాను జాతీయ సంఘం ఏర్పాటు చేయాలి.


డిశెంబరు 2002
86 వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ఆర్టికల్ 21 ఎ మూడవ భాగం ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు నిర్భంద ఉచిత విద్య,  ప్రాథమిక హక్కుగా చేసేందుకు ఉద్దేశింప బడింది.
అక్టోబరు 2003
పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యా బిల్లు 2003 పై ఆర్టికల్లో అనుకున్న విధంగా మొదటి ముసాయిదా చట్టాన్ని అక్టోబరు 2003లో తయారు చేసి పెద్ద మొత్తంలో ప్రజా స్పందనకు మరియు సూచనలను పొందుటకుగాను ఈ క్రింది వెబ్ సైట్ లో ఉంచబడింది.
2004 ఆ తర్వాత ఈ బిల్లు ముసాయిదా పై వచ్చిన సూచనలననుసరించి ఉచిత నిర్భంధ విద్యాబిల్లు 2004 కి సంబంధించిన మార్పుచేసిన బిల్లు ముసాయిదా తయారు చేసి ఈ క్రింది వెబ్ సైట్ లో పెట్టబడింది.
http://education.nic.in

జూన్ 2005
కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) కమిటీ తయారు చేసిన ఉచిత నిర్భంద విద్య బిల్లు ముసాయిదా ను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు.  మానవ వనరుల మంత్రిత్వశాఖ జాతీయ సలహా మండలి (ఎన్ ఎ సి)  చైర్మన్ అయిన శ్రీమతి సోనియా గాంధీకి పంపించారు.  జాతీయ సలహామండలి బిల్లుని ప్రధాన మంత్రికి పరిశీలన కొరకై పంపించింది .
పద్నాల్గవ (14) తేదీ జులై 2006
ఆర్థిక శాఖ, ప్లానింగ్ కమీషన్ లు నిధుల లేవని చెప్పి ఈ బిల్లును ఆమోదించలేదు.  ఈ బిల్లు ముసాయిదాను అవసరమైన ఏర్పాట్లు కొరకు రాష్ట్రాలకు పంపబడినది. (86 వ రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల లేమిని ఎప్పుడో ప్రకటించాయి).
పంతొమ్మిదవ (19) తేదీ జులై 2006
బాలకార్మిక నిర్మూలన ప్రచారము (సి ఎ సి ఎల్), విద్యను ప్రాథమిక హక్కు గా రావడానికి కృషిచేసే జాతీయ కూటమి (ఎస్ ఎ ఎఫ్ ఇ), జాతీయ విద్యా విధాన సలహా మండలి (ఎన్ ఎ ఎఫ్ ఆర్ ఇ), కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) మొదలగునవి భారత అక్షరాస్యతా పథకము (ఐ ఎల్ పి) మరియు ఇతర సంస్థలను ఆహ్వానించి ప్రణాళికా సమావేశము ఏర్పాటుచేసి, ఆ సమావేశములో పార్లమెంటులో ఈ చర్య ప్రభావము మరియు సమర్ధన చర్యలు ఎలా మొదలుపెట్టాలి మరియు జిల్లా, పల్లెల స్థాయిలో ఏ విధంగా అమలు పరచ వలెనో దిశానిర్ధేశకం చేయడంపై చర్చించాయి.

ఈ  చట్టం ఎందుచేత అత్యంత ఆవశ్యకము ?
రాజ్యాంగ సవరణను అమలు పరచుటలో ప్రభుత్వం యొక్క చురుకైన పాత్రకు ఇది మొదటి మెట్టు కాబట్టి ఈ  బిల్లు ముఖ్యమైనది. మరియు చట్టం ఎందువలన ముఖ్యమైనదంటే:
· ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య మరియు తరువాత స్థాయి విద్య ఏర్పాటుని శాసననిర్మాణం చేస్తుంది.
· ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలని ఏర్పాటు చేస్తుంది.
· పాఠశాల పర్యవేక్షక కమిటీ (పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే ఆ ఆవాసంలో గల ఎన్నికైన సభ్యులు) ఏర్పాటు చేస్తుంది
· ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలెవరూ పనిలోకి వెళ్ళకుండా   శాసనం చేస్తుంది.
ఇటువంటి మంచి చర్యలు ప్రజల విద్యా విధానము అభివృద్ధికై పునాదిగా ఉపయోగబడి, నాణ్యమైన విద్య అందరి పిల్లలకి కల్పించబడేటట్లు చేస్తాయి. తద్వారా సాంఘికంగా మరియు ఆర్థికంగా బహిష్కరణకు ప్రజలు గురికావడం నివారింపబడుతుంది

ఎందువలన 6-14 సంవత్సరముల వయస్సుగల పిల్లల గ్రూపునే ఎంచుకోవాలి ?
ఈ చట్టం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, నిర్భంధంగా పిల్లలందరికీ కల్పించబడేటట్లు కేంద్రీకరిస్తుంది.  ఈ వయస్సుగల పిల్లల గ్రూపుకి, ఈ నిర్భంధవిద్యను కల్పించబడడం ద్వారా వారి భవితకు పునాది ఏర్పాడుతుంది. 

చట్టం ఎందుకు ప్రాముఖ్యం మరియు భారతదేశానికి ఎటువంటి మేలు చేస్తుంది?
పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారీచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలుస్తుంది
నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.

ఉచిత మరియు తప్పనిసరి ప్రాధమిక విద్య’ అంటే ఏమిటి?
6 నుండి 14 వయస్సులోపు అందరి పిల్లలకు దగ్గరున్న పాఠశాలలో ఉచిత మరియు తప్పనిసరి విద్య అర్జించే హక్కుకలదు.
పిల్లలు కాని తల్లిదండ్రులు కాని ప్రాధమిక విద్యని అభ్యసించడానికి, ప్రత్యక్షమైన (స్కూల్ ఫీజు) లేదా పరోక్షమైన (యూనిఫార్మ్ లు, టెక్ట్స్ బుక్ లు, మధ్యాహ్న భోజనం, రవాణా) ఖర్చులు భరించనవసరం లేదు. ఒక పిల్లవాడు ప్రాధమిక విద్యను పూర్తి చేసే వరకు ప్రభుత్వం ఉచితంగా చదువుని అందిస్తుంది.

ఆర్ టి ఇ ని సాధించడానికి కమ్యూనిటీకి మరియు తల్లిదండ్రులకి పోషించే పాత్ర ఏమిటి?
పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారిచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోఒక మైలురాయిగా నిలుస్తుంది. భారతదేశపు చరిత్రలో మొట్ట మొదటి సారిగా, కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ద్వారా నాణ్యమైన ప్రాధమిక విద్యను పొందే హక్కును అందించే హామీ ఇస్తుంది.
విద్యార్ధులకు వారి పూర్తి సామర్ధ్యాన్ని అభివృద్ధి పరుచుకోవడంలో దోహదపడేలా చూడడానికి, ప్రపంచంలోని కొన్ని దేశాలు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహపూర్వకంగా ఉండే విద్యను అందించే జాతీయ సదుపాయం కలదు. 2009 లో, 6 నుంచి 14 వయస్సు లోపు పాఠశాలకు వెళ్ళని పిల్లలు 8 మిలియన్లు ఉన్నారని అంచనా. భారతదేశము లేకుండా 2015 నాటికి ప్రతి పిల్లవానికి పూర్తి ప్రాధమిక విద్య అనే లక్ష్యాన్ని ప్రపంచం చేరుకొలేదు.
స్థానిక అధికార ఉద్యోగులు, తల్లిదండ్రులు, గార్డియన్లు మరియు టీచర్లతో పాఠశాలలు, పాఠశాలల నిర్వహణ సంఘాన్ని (ఎస్ ఎమ్ సి లని) నియమించాలి. ఎస్ ఎమ్ సి లు, పాఠశాల అభివృద్ధి పథకాలని తయారు చేయడం మరియు ప్రభుత్వపు ధనాన్ని వినియోగాన్ని మరియు మొత్తం పాఠశాల వాతావరణాన్ని ఎస్ ఎమ్ సి ఎస్ లు పర్యవేక్షించాలి.
ఎస్ ఎమ్ సి లలో లాభం పొందని గ్రూపుల నుండి 50 శాతం ఆడవాళ్ళని మరియు తల్లిదండ్రులని చేర్చుకోవాలని కూడా ఆర్ టి ఇ తీర్మానిస్తుంది. బాలురకి మరియు బాలికలకి వేరు వేరు మరుగుదొడ్ల సదుపాయాలు మరియు ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం మరియు ఆరోగ్య సమస్యలకి తగినంత శ్రద్ధ అందించడం ద్వారా స్నేహపూర్వకమైన “పూర్తి పాఠశాల” వాతావరణాన్ని కల్పించడంలో ఇటువంటి సంఘం కీలక పాత్ర వహిస్తుంది.

ఆర్ టి ఇ బాల్య స్నేహపూర్వక పాఠశాలలను ఎలా ప్రోత్సాహిస్తుంది?
ప్రభావితంగా అభ్యాసించే వాతావరణం కోసం, అన్ని పాఠశాలలు అవస్థాపన వసతులు మరియు ఉపాధ్యాయ ప్రమాణాలని పాటించాలి. ప్రాధమిక స్థాయిలో, ప్రతీ 60 మంది విద్యార్థులకు ఇద్దరు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు.
ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా మరియు సమయానికి పాఠశాలకు హాజరుకావాలి పూర్తి పాఠ్యప్రణాళికలని పూర్తి చేయాలి, అభ్యాస సామర్ధ్యాలను అంచనా వేయాలి, ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలను క్రమంగా నిర్వహించాలి. గ్రేడు ఆధారంగా కన్నా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
విద్యార్థుల మెరుగైన అభ్యాస ఫలితాలను అందించే ఉపాధ్యాయులకు ప్రభ్యుత్వం సంతృప్తికరమైన సహాయం అందించాలి. సమానత్వంతో కూడిన పాఠశాల నాణ్యతను అందించడానికి, ఎస్ ఎమ్ సి ల సహాయ సహాకారంతో కమ్యూనిటీలు మరియు పౌరసంఘాలు ప్రముఖపాత్ర పోషించాలి. ప్రతి పిల్లవానికి ఆర్. టి. ఇ ను నిజమయ్యేలా చేయడానికి, రాష్ట్రం పోలసీ విధానాలని ఇస్తుంది మరియు సమర్ధవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

భారతదేశంలో ఆర్ టి ఇ కి ఏ విధంగా ఆర్ధికసహాయం ఇవ్వబడుతుంది మరియు అమలు పరుస్తారు?
నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.
ఆర్ టి ఇ కొరకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక భాధ్యతలను పంచుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖర్చుల అంచనాలను తయారుచేస్తుంది. ఈ ఖర్చులలో కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వబడును.
ఆర్. టి. ఇ యొక్క సదుపాయాలను నిర్వహించడానికి రాష్ట్రానికి అదనపు వనరులను అందించ డానికి, కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘాన్ని అభ్యర్ధించవచ్చు.
ఆచరణకు అవసరమైన మూలధనమును అందించుటలో రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహిస్తుంది. నిధుల కొరత ఉంటుంది. దీనిని పౌర సంఘం, అభివృద్ధి సంస్థలు, కోర్పరేట్ సంస్థల నుండి భాగస్వాముల దగ్గర నుండి మరియు దేశ పౌరులు నుండి మద్దతు తీసుకోవలసి ఉంటుంది.


ఆర్ టి ఇ ని సాధించడానికి ముఖ్యమైల సమస్యలు ఏమిటి?
ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి ఆర్ టి ఇ చట్టం ఆచరణలోకి వస్తుంది. వీలైనంత త్వరగా ప్రకటించడానికి మరియు రాష్ట్రాలు తమ నియమాలను రూపొందించడానికి అవసరమయ్యే డ్రాఫ్ట్ నమూన నియమాలు ప్రభుత్వాలతో పంచుకోబడతాయి.
బాల కార్మికులు, వలస వచ్చిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు లేదా “సాంఘిక, ఆర్ధిక, భౌగోళిక, భాష, లింగపరంగా లేదా అటువంటి కారణం వలన” నష్టపడిన పిల్లలు వంటి ప్రయోజనము చేకూరని గ్రూపులకి ప్రత్యేకమైన ఏర్పాట్లతో, ఆర్ టి ఇ అందనివారికి ఒక మంచి ప్లాట్ ఫార్మ్ ని అందిస్తుంది. విధంగా ప్రత్యేక సదుపాయాలతో లాభపడని తెగలకు గట్టి ఆధారం అందిస్తుంది. వేగవంతమైన ప్రయత్నాలు మరియు పెద్ద మొత్తంలో సంస్కరణలు అవసరమయ్యే శిక్షణ మరియు అభ్యాసం యొక్క నాణ్యత మీద అర్ టి ఇ దృష్టి కేంద్రీకరిస్తుంది :
· రానున్న 5 సంవత్సరాలలో, 1 మిలియన్ కన్నా ఎక్కువ క్రొత్త మరియు శిక్షణ ఇవ్వని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నైపుణ్యాలని పటిష్ట పరచి, స్నేహసంబంధ బాల్య విద్యని అందించడానికి సృజనాజత్మకమైన మరియు నిలకడ అయిన చొరవలు కీలకమైనవి.
· భారతదేశంలో నేటికి ప్రాధమిక విద్య అభ్యసించవలసిన 190 మిలియన్ల బాలురు బాలికలు ప్రతి ఒక్కరకి స్నేహసంబంధ బాల్య విద్యని సమకూర్చడానికి, కుటుంబములు మరియు కమ్యూనిటీలు కూడా చాలా పెద్ద పాత్రని పోషించాలి.
· సమానత్వంతో కూడిన నాణ్యతను ఇవ్వడానికి తారతమ్యములను నిర్మూలించవలెను. ఫ్రీ స్కూల్ లో పెట్టుబడి పెట్టుటయే గమ్యములను చేరుకొనుటకు ముఖ్య వ్యూహరచన.
· పాఠశాలలో చేరని 8 మిలియన్ల పిల్లల్ని తరగతుల లోకి సరైన వయస్సులో పాఠశాలలో తీసుకువచ్చి సహకారంతో ఉండడానికి సహకరించి, విజయవంతం కావడానికి అనుకూల మైన, సృజనాత్మక దృక్పధములు ఎంతో అవసరం.
ఆర్ టి ఇ ని ఉల్లంఘించినట్లయితే ఏ చర్య అందుబాటులో ఉంది?
ఈ చట్టం క్రింద ఇచ్చిన హక్కుల రక్షకాలను, పిల్లల హక్కుల రక్షణ జాతీయ సమితి సమీక్షించి, ఫిర్యాదులను పరిశోధించి మరియు విచారణ చేస్తున్న కేసులలో, సివిల్ కోర్టు పవర్లను కలిగి ఉంటుంది.
ఏప్రిల్ 1 నుండి ఆరు నెలలు లోపు, పిల్లల హక్కుల రక్షణ కొరకు ఒక రాష్ట్ర సమితిని (ఎస్ సి పి సి ఆర్) లేదా విద్యా హక్కు రక్షణ అధారిటీ (ఆర్ ఇ పి ఎ) ని రాష్ట్రాలు నియమించాలి. స్థానిక అధికారు లకి, ఏ వ్వక్తి అయినా ఒక సమస్యని ఫైల్ చేయాలనుకుంటే, వ్రాత పూర్వకంగా ఫిర్యాదును అందించాలి.ఎస్ సి పి సి ఆర్/ఆర్ ఇ పి ఎ చే విన్నపములు నిర్ణయించబడతాయి. సముచితమైన ప్రభుత్వముచే అధికారం ఇవ్వబడిన ఆఫీసర్ యొక్క ఆమోదం ఫిర్యాదుల పరిశీలనకు అవసరం.

ఆర్ టి ఇ యదార్ధంగా ఏవిధంగా కార్య రూపం దాల్చుతుంది?
సమానత్త్వంతో నాణ్యతను అందించడంలో మరియు తారతమ్యములను నిర్మూనించుటకు గట్టి ప్రయత్నాలు అవసరం. సెలబ్రిటి ప్రపంచం, సమాచార సాధనం, ఉపాధ్యాయ సంస్థలు, పౌర సంఘం, ప్రభుత్వం నుండి సంబధిత స్టేక్ హోల్డర్స్ ఒక చోటికి చేర్చడంలో యూనిసెఫ్ ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది.
కార్యరూపం దాల్చడానికి పిలుపునివ్వడానికి మరియు ప్రజలలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్ భాగస్వాములను పంపిస్తుంది. పిల్లలకు మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో, ప్రాప్యత మరియు నాణ్యమైన విద్యని మెరుగుపరచడం మీద పోలసీ మరియు పధకము రూపకల్పన/అమలు దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆర్ టి ఇ పై, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సంఘాలను పటిష్టం చేయడానికి, యూనిసెఫ్ భాగస్వాములతోకూడా కలిసి పనిచేస్తుంది.

విద్య హక్కును ఆమోదించిన 135వ దేశం భారతదేశం 

భారతరాజ్యాంగంలో సవరణ  చేసిన ఆరు సంవత్సరాల తరువాత, యూనియన్ క్యాబినెట్ విద్యను హక్కుగా పొందే బిల్లుని ఆమోదించింది. ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్య పొందే ప్రాథమిక హక్కుని ఆమోదించడానికి ఇప్పుడు తొందరలో పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే ప్రాథమిక హక్కు బిల్లుని భారత ప్రభుత్వం  స్వాతంత్ర్యం వచ్చిన ఆరు కన్నా ఎక్కువ దశాబ్దాల
తరువాత ఆమోదించింది.
ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే  విద్యాహక్కు బిల్లుని యూనియన్ క్యాబినెట్ ఎంతోకాలం తరువాత ఆమోదించింది. విద్యారంగ అభివృద్ధికి ఇది ఎంతగానో శక్తిని ఇస్తుంది.
ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే ముఖ్యమైన నిభంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. పిల్లలకి అయ్యే ఖర్చు ప్రభుత్వం పాఠశాలలకు ఇస్తుంది. ప్రవేశ రుసుము తీసుకోకూడదని, ప్రవేశానికి పిల్లలని లేదా తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేయకూడ దన్న నిభంధనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి.
పిల్లలని భౌతికంగా దండించడం, బహిష్కరించడం లేదా నిర్భంధించడం మరియు ఉపాధ్యాయుల్ని జనాభా లెక్కలు లేదా ఎన్నికల మరియు ఆపద్కాల ఉపశమన బాధ్యతలు తప్ప ఇతర బాధ్యతల్లో నియుక్తించడాన్ని ఈ బిల్లులో నిషేధించారు. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే చట్టబద్దంగా చర్య తీసుకుంటారు.
పిల్లలకిచ్చిన ముఖ్యమైన మాటగా, విద్య ఒక ప్రాథమికహక్కు అవుతుండడంతో కేంద్ర మరియు రాష్ట్రాలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించడం చట్టపరంగా తీసుకోవలసిన బాధ్యత అని పి. చిదంబరం చెప్పారు.
కొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కమిషన్ తో సంప్రదించిన తరువాత మానవ వనరుల మంత్రిత్వ శాఖ బిల్లుని విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.
ఈ బిల్లుని పరిశీలించే పనిని మంత్రుల సముదాయాని (జి ఒ ఎమ్)కి ఇచ్చారు. ఈ బిల్లులోని అంశాల్ని ఏమాత్రం మార్చకుండా ఈనెల మొదట్లో  ముసాయిదా చట్టాన్ని మంత్రుల సముదాయం ఆమోదించారు. ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే  నిభంధన కూడా ఉంచారు. ప్రైవేటురంగం ద్వారా రాష్ట్రంయొక్క చట్ట బాధ్యతల్ని నెరవేర్చడానికి ఇది ఒక మార్గంగా కొంత మంది భావిస్తున్నారు.
86 వ రాజ్యాంగ సవరణ ప్రకటించడానికి విద్యా హక్కు బిల్లు చట్టానికి తోడ్పడింది. ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాల బాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పిస్తుంది. ఇది చేయడానికి 61 సంవత్సరాలు పట్టింది.
1937 సంవత్సరములో మహాత్మాగాంధి అందరికి విద్య అవసరమని చెప్పినప్పుడు, ఇప్పటి సమస్య లాగానే ఖర్చు ఒక అడ్డు గోడలా ఎదురయింది. పద్నాలుగు సంవత్సరాలు వయస్సు గల అందరి పిల్లలకి ఉచిత మరియు నిర్భంధిత విద్య కల్పించడం అనిర్దుష్టమయిన మనవి అని రాజ్యాంగం విడిచి పెట్టింది. కాని ప్రాథమిక పాఠశాల ప్రవేశము ఈ రోజులలో కూడా సందేహాస్పదమే.
2002 సంవత్సరములోనే, విద్యని ప్రాథమిక హక్కుగా 86 రాజ్యాంగ సవరణలో చేయ బడింది.
2004 సంవత్సరములో ప్రభుత్వాధికారంలోనున్న జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్ డి ఎ) ముసాయిదా పత్రాన్ని తయారుచేసింది. కానీ అది ప్రవేశపెట్టేలోపలే ఎన్నికలలో ఓటమిని చవి చూసింది. ప్రస్తుతం అధికారం లోనున్న సంకీర్ణ ప్రగతి శీల కూటమి (యు పి ఎ) యొక్క నమూనా బిల్లు, కేంద్ర రాష్ట్రాల మధ్యలో నిధులు మరియు బాధ్యతల విషయంల్లో అల్లాడి పోతుంది.
బిల్లులో ఉన్న వయోనిభంధనలపై విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఆరు సంవత్సరముల క్రింద మరియు  పద్నా లుగు సంవత్సరాల పైన ఉన్న పిల్లలని కూడా కలపాలని చెపుతున్నారు. ఉపాధ్యాయుల కొరత, తక్కువ నైపుణ్యంగల ఎంతోమంది ఉపాధ్యాయులు మరియు విద్యా అవస్థాపక సౌకర్యాల కొరతలు ఉన్న ప్రస్తుత పాఠశాలల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం క్రొత్త పాఠశాలల్ని మాత్రమే నిర్మించి  అభివృద్ది   చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఈ బిల్లు న్యాయ మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖల నుండి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహకారము విషయంలో వ్యతిరేకత ఎదురైంది.  కేంద్ర మంత్రిత్వశాఖ రిజర్వేషన్లలో 25 శాతము పెంపు విషయంలో ఆటంకములు ఎదురౌతాయని భావించింది.  అదే సమయంలో మానవ వనరులశాఖ 55,000 కోట్ల రుపాయలు ప్రతి సంవత్సరము అవసరమౌతాయని అంచనావేసింది.
జాతీయ ప్రణాళికా సంఘం మూల ధనాన్ని భరించుటకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది.  రాష్ట్ర ప్రభుత్వాలు మూలధనంలో కొంత భాగం కూడా భరించడానికి సిద్ధంగా లేమని చెప్పాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం. ఇక తప్పని సరై ఈ బిల్లుని మొత్తం తొక్కపెట్టడానికి సిద్ధపడింది.
పాఠశాల” అనే పదం మౌలిక భవన సదుపాయములతో కూడిన దైనప్పటికీ, ఈ బిల్లు ముసాయిదా ప్రతి ఆవాస ప్రాంతంలో మూడు సంవత్సరములలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకుంది. 
దూరప్రాంతాలైన పల్లెలు మరియు నగర పేదవాడలలో పాఠశాల స్థాపనకు మామూలుగా అవసరమైన పరిపాలనా విధాన మంజూరు వంటి అవరోధములు లేకుండా కొన్ని కనీస ప్రమాణములు తయారు చేయబడ్డాయి.  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక అంశాలతో ముడిపడిన కారణాలతో పిల్లలు స్కూలుకు పోకుండా చేసే విషయాలను పరిష్కరించడానికి సహాయ సహకారాలను అందిస్తానని అంగీకరించాయి.

No comments

Post a Comment