| About us | Contact us | Advertise with us

Saturday, February 25, 2012

విద్యాదృక్పధాలు - సిలబస్‌ మరియు ఎలా చదవాలి?

స్కూల్ అసిస్టెంట్స్ సిలబస్ 1. విద్య చరిత్ర : పూర్వవేద కాలం, వేదకాలం తర్వాత, మధ్యయుగాలలో విద్య, బ్రిటీష్ కాలంలో విద్యపై పనిచేసిన వివిధ ... thumbnail 1 summary
స్కూల్ అసిస్టెంట్స్ సిలబస్
1. విద్య చరిత్ర : పూర్వవేద కాలం, వేదకాలం తర్వాత, మధ్యయుగాలలో విద్య, బ్రిటీష్ కాలంలో విద్యపై పనిచేసిన వివిధ కమిటీలు. వుడ్స్ డిస్పాచ్ (154), హంటర్ కమిషన్ (12), హర్టాగ్ కమిటి (1929), సార్జంట్ కమిటి (1944)లకు ప్రాధాన్యం. స్వాతంత్య్రానంతరం విద్యపై పనిచేసిన వివిధ కమిటీల సిఫారసులు. ముదలియార్ కమిషన్ (1953-53), కొఠారి కమిషన్ (1964-66), ఈశ్వరీభాయి పటేల్ కమిటి (1977), ఎన్‌పిఈ-196, పి.ఓ.ఏ - 1992.

2. ఉపాధ్యాయ సాధికారత : అర్థం, సాధికారతకు చొరవలు, ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తనా నియమావళి, ఉపాధ్యాయు లకు స్ఫూర్తి, ఉపాధ్యా యులు, ఉపాధ్యాయ సంఘాల వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయ విద్యకై పనిచేస్తున్న జాతీయ, రాష్ర్టస్థాయి సంస్థలు, పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్లు.

3. వర్తమాన భారతదేశంలో విద్యాసంబంధ అంశాలు : పర్యావరణ విద్య, అర్ధం, పరిధి, సుస్థిర అభివృద్ధి, ఉపాధ్యాయుని పాత్ర, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పాఠశాల, ప్రభుత్వేతర స్వచ్ఛంధ సంస్థల పాత్ర, విద్య, ప్రజాస్వామ్యం, సమత్వం, సమానత్వం, విద్యలో నాణ్యత, విద్యావకాశాల కల్పనలో సమానత్వం, విద్యా రంగం-ఆర్థికాంశాలు. మానవ పెట్టుబడికి ఉపకరంగా విద్య-అర్ధం, నిర్వచనం, విద్య మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత - సాక్షర భారతి మిషన్, జనాభా విద్య, జనాభా విద్య ప్రాధాన్యం, జనాభా విద్యలో వివిధ రూపాలు, ఉపాధ్యాయుడు, పాఠశాల పాత్ర, ఉపాధ్యాయ విద్యలో

కుటుంబ జీవన విద్య : సుస్థిర అభివృద్ధి, కౌమార విద్య, ఆరోగ్య విద్య, లింగ సమానత్వం, సమత్వం, మహిళా సాధికారత, పట్టణీకరణ, వలసలు, జీవన నైపుణ్యాలు, సమ్మిళిత విద్య, అర్ధం, పరిధి, అపోహలు, వాస్తవాలు, లక్షణాలు, వర్గీకరణ మరియు వివిధ రకాలు, తొలి దశలోనే గుర్తింపు-మదింపు, సమ్మిళిత విద్య ప్రణాళిక, సమ్మిళిత విద్య-తరగతి గది నిర్వహణ, మూల్యాంకనం, డాక్యు మెంటేషన్, రికార్డుల నిర్వహణ, మనోవైజ్ఞానిక, సామాజిక నిర్వహణ, చైతన్యం, వ్యూహాలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, విలువల విద్య, సర్వశిక్ష అభియాన్, ప్రాథమిక విద్యాస్థాయిలో బాలికా విద్యా జాతీయ కార్యక్రమాలు, మధ్యాహ్నభోజన పథకం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA), KGBA స్కూల్స్.

4. చట్టాలు/హక్కులు : ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిర్భంధ విద్యా నిబంధనలు-2010, పిల్లల హక్కులు, మానవ హక్కులు.

5. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005 : దృక్పథాలు, అభ్యాసం, విజ్ఞానం, పాఠ్య ప్రణాళికా అంశాలు, పాఠశాల దశలు, మదింపు, పాఠశాల, పాఠశాల తరగతి వాతావరణం, క్రమబద్ధ సంస్కరణలు.పర్‌స్పెక్టివ్స్ విభాగాన్ని ఏ పంథాలో చదవాలి?
ప్ర : నూతనంగా ప్రవేశపెట్టిన పర్ స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ చాలా విస్తృతంగా ఉంది కదా! ఎలా చదవాలి?
జ - సిలబస్ పరిధి విస్తృతంగా ఉన్న మాట వాస్తవమే. అయితే అంశా లు నిర్దిష్టంగా పేర్కొన బడ్డాయి. అందువల్ల సిలబస్‌లో పేర్కొన్న అంశాలను సవివరంగా చదివితే సరిపోతుంది. ఉదాహ రణకు మొదటి యూనిట్‌లో స్కూల్ అసిస్టెంట్ వారికి బ్రిటిష్ కాలంలో, స్వాతంత్య్రా నంతరం వివిధ విద్యా కమిషన్లు అని నిర్దిష్టంగా ఏయే కమిషన్లను అధ్యయనం చేయాలో కూడా పేర్కొనడం జరిగింది. అదే ఎస్‌జిటి సిలబస్‌లో స్వాతంత్య్ర పూర్వ, స్వాతంత్య్ర అనంతర విద్యా కమిషన్లు అని పేర్కొనడం జరిగింది. ఇది కూడా దాదాపు అదే సిలబస్ కాని పరిధిలో తేడా ఉంటుంది.

ప్ర : పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఒకటేనా? తేడా ఏమైనా ఉందా? ఏ పుస్తకం చదవాలి? తెలుగు అకాడమీ నుంచి అలాంటి పుస్తకాలు వెలువడే అవకాశం ఉందా?
జ - ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్‌కు 90 శాతం సిలబస్ ఒక్కటే. ఆ 10 శాతం మొదటి యూనిట్‌లో తేడా ఉంది. దీనిలో స్కూల్ అసిస్టెంట్ వారికి చారిత్రాత్మక అంశాలు విస్తృతం గా ఇవ్వడం జరిగింది. ఎస్‌జిటి సిలబస్‌లో విద్యకు సంబంధించిన రాజ్యాంగబద్ధ అవకాశాలు, హక్కులు, ఇటీవలి స్కీములు, విద్యా కార్యక్రమాలకు అధిక ప్రాధా న్యత ఇవ్వడం జరిగింది. మిగిలిన నాలుగు యూనిట్లు యస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్‌కు ఒకేవిధంగా ఉన్నాయి. అయితే ఎస్‌జిటి వారికి ఎక్కువ సంఖ్యలో జ్ఞానం, అవగా హనను పరీక్షించే రకంగా ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్ వారికి అవగాహన, వినియోగం, విశ్లేషణను పరీక్షించే రకం ప్రశ్నలు ఇవ్వబడుతున్న విషయం గత డిఎస్సీ మరియు టెట్ పరీక్షల అనుభవాల దృష్ట్యా గ్రహించి, తగిన విధంగా ప్రిపేరేషన్ కొనసాగించాలి.

ప్ర : పర్‌స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కోసం ఏ పుస్తకాలు చదవాలి?
జ - పి.ఇ. సిలబస్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క పుస్తకమూ పూర్తి సిలబస్‌ను కవర్ చేయదు. సిలబస్‌లోని టాపిక్‌లు బిఇడి, డిఎడ్ సిలబస్‌లోని వివిధ పేపర్ల నుంచి ఎంపిక చేయబడిన దృష్ట్యా సంబంధిత తెలుగు అకాడమీ పుస్తకాలలో యూనిట్లను ఎంపిక చేసుకుని చదవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రధానంగా బిఇడి / డిఎడ్‌కి సంబంధించిన పేపర్-1 ః విద్యా ఆధారాలు/‘వర్ధమాన భారతదేశంలో విద్య’(డిఎడ్), బిఇడి, పేపర్-3 ః ‘పాఠశాల నిర్వహణ, విద్యా వ్యవస్థలు’, డిఎడ్, పేపర్-4 - ‘సమ్మిళిత విద్య’ తెలుగు అకాడమీ పుస్తకాలు 0 శాతం సిలబస్‌ను కవర్ చేస్తాయి. డిఎడ్-పేపర్-3 - ‘ఎలిమెంటరీ విద్య’ అనే పుస్తకంలో పి.ఇ. సిలబస్ యూనిట్-2 - ‘ఉపాధ్యాయుల సాధికారత’ టాపిక్ లభిస్తుంది. ఇతర ఒకటి రెండు, సమకాలిన అంశాలు - సమాచార హక్కు చట్టం, మానవ హక్కులు, జాతీయ విద్య ప్రణాళిక చట్టం వంటి అంశాలు కరెంట్ అఫైర్స్ లేదా సంబంధిత శాఖల వెబ్‌సైట్ నుంచి సేకరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఆందోళన చెంద కుండా అందుబాటులో ఉన్న 90 శాతం సిలబస్‌తో ప్రిపరేషన్ మొదలు పెడితే త్వరలో మిగతా టాపిక్స్‌కు సంబంధించిన సిలబస్ కూడా కవర్ చేసే పుస్తకాలు మార్కెట్‌లో లభిస్తాయి. మెటీరియల్ క్వాలిటీ ప్రత్యేకించి అనుబంధంగా ఇచ్చిన మాదిరి ప్రశ్నల స్థాయి, తీరును గమనించి నాణ్యతగల మెటీరియల్‌ను ఎంపిక చేసుకో వాలి. తెలుగు అకాడమీ ఇందుకు సంబంధించిన పుస్తకం విడుదల చేస్తుందా? అన్న అంశంపై ప్రస్తుతానికి నిర్దిష్ట సమాచారం లేదు.

ప్ర : కంటెంట్ సిలబస్ కూడా విస్తృతంగా ఇవ్వడంతోపాటు ఇంటర్, డిగ్రీకి చెందిన అంశాలు ఇవ్వబడ్డాయి. వీటికి ఎలా చదవాలి? డిగ్రీ సిలబస్ స్థాయిలో కూడా ప్రశ్నలు అడుగుతారా?
జ - కంటెంట్‌కు మార్కులు పెంచడంతోపాటు సిలబస్ పరిధి విస్తృతంగా ఉంటుందని, స్కూల్ అసిస్టెంట్ వారికి ఆరు నుంచి పదో తరగతి వరకూ, ఇంటర్మీడియట్‌కు అను సంధానిస్తూ కాఠిన్యతా స్థాయి ఉంటుందని నోటి ఫికేషన్ లో పేర్కొనబడింది. ఇటీవల ప్రకటించిన సంబంధిత సిలబస్‌ను చూస్తే పరిధి విస్తృతంగా ఇవ్వడం జరిగిందనే భావన వినిపిస్తుంది. ఇంటర్మీడియట్ సిలబస్ లోని అంశాలు ఎక్కువగా ఇవ్వబడినాయి. కొన్ని టాపిక్‌లు డిగ్రీ స్థాయికి చెందినవిగా అనిపించినప్పటికీ వాటి ప్రాథమిక అంశాలు ఇంటర్‌లో ఇటీవల సిలబస్‌లో ఉండి ఉంటాయి పరిశీలించి చూడండి. ప్రశ్నల కాఠిన్యత స్థాయి, సిలబస్ మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఇంటర్మీడియట్ స్థాయికే పరిమితం.

ప్ర : స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్), టిపిటి, గ్రేడ్-1, 2 వారికి జికె మరియు పి.ఇ. అంశాలకు చెందిన ప్రశ్నలు ఏ మీడియంలో ఇవ్వబడతాయి?
జ - డిఎస్సీ ప్రశ్నాపత్రం యథాప్రకారం తెలుగు/ఇంగ్లిష్ రెండు భాషల్లో ఉంటుంది. లాంగ్వేజెస్‌కు చెందిన కంటెం ట్, మెథడాలజీకి చెందిన ప్రశ్నలు మాత్రం ఆ లాంగ్వేజ్ లోనే ఇవ్వబడతాయి.

ప్ర : ఇటీవలి టెట్ అనుభవం దృష్ట్యా ఎక్కువ శాతం అవ గాహన, వినియోగం విశ్లేషణలను పరీక్షించే ప్రశ్నలు అడుగుతున్నారు కదా! వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
జ - ఈ ధోరణి డిఎస్సీ-2000 తర్వాత ప్రారంభమై ఇటీవలి డిఎస్సీ/టెట్ పరీక్షల్లో విస్తృత స్థాయికి చేరుకుందని గ్రహించవచ్చు. ఈ అంశాన్ని గ్రహించి తగిన విధంగా తయారుకావడం అవసరం. ఇక్కడ ప్రత్యేకించి అవగాహ న, విశ్లేషణ, అన్వయాలతో కూడిన ప్రశ్నలకు కూడా విషయ పరిజ్ఞానం (నాలెడ్జ్) ఆధారం అన్న అంశాన్ని మరవకూడదు. సొంతంగా ప్రిపేర్ అయ్యే వారు మొదటి రౌండ్‌లో విషయ పరిచయంతో పాటు అవగాహనను పరీక్షించే ప్రశ్నలపై దృష్టి సారించాలి. తర్వాత దశల్లో వినియోగం, విశ్లేషణాత్మక ప్రశ్నలను రూపొందిం చుకోవాలి. ఇందుకు స్నేహితులతో చర్చించ డం, అనుభ వజ్ఞులైన అధ్యాపకుల సూచనలు, ఈ దిశలో ప్రశ్నలు కలిగిన మెటీరియల్ దోహదపడతాయి.

No comments

Post a Comment